Shruti Haasan: "ఉళగనాయగన్" కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందా..అంటే అవుననే మాట అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ మల్టీ టాలెంటెడ్ చేతిలో ఉంది రెండంటే రెండు సినిమాలు మాత్రమే. తండ్రి కమల్ హాసన్‌కే సొంత నిర్మాణ సంస్థ ఉంది. అదే, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఈ బ్యానర్‌లో ప్రస్తుతం, రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కానీ, అవి కూతురు కోసం చేస్తున్నవి కాదు.
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ధర్మన్ ఒకటి కాగా, మరో సినిమాను కూడా కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. ఆయన, హీరోగా రూపొందుతోన్న భారతీయుడు 3 మళ్ళీ వార్తల్లో నిలిచింది. అయితే, శ్రుతి హాసన్ కోసం కమల్ కథ సెలెక్ట్ చేసి ఆయన సొంత సంస్థలో సినిమా తీయొచ్చు కదా అని పలువురు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.నిజమే, బయట నిర్మాతలు రానప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిన సొంత సంస్థలో శ్రుతి కోసం కమల్ సినిమా చేయొచ్చు కదా.
శ్రుతి హాసన్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, లిరిక్ రైటర్, యాక్టర్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ ఈ మధ్య రేసులో బాగా వెనకబడింది. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో స్పెషల్ నంబర్‌లో సందడి చేసింది. కానీ, సాంగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలిసి చేస్తున్న వారణాసి సినిమాలో సంచారి అనే సాంగ్ పాడింది.
అయితే, హీరోయిన్‌గా శ్రుతి హాసన్ చేతిలో ఉంది రెండు సినిమాలు. వాటిలో ఒకటి ట్రైన్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పలు వాయిదాల తర్వాత నవంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక, మరో సినిమా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒకతార. ఈ సినిమా కూడా నవంబర్ 20న రిలీజ్ కాబోతోంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటి తర్వాత శ్రుతి కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి, ఒకప్పుడు వరుసగా భారీ హిట్స్ అనుకున్న రుతి..ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.












