Namrata Shirodkar: మన సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గానూ ఉంటూ కోట్లలో సంపాదిస్తున్నారు. కూల్ డ్రింక్ యాడ్స్, ప్యారష్యూట్ ఆయిల్, డిజర్జెంట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, క్లాత్ ఎంపోరియం, సిమెంట్ కంపెనీ యాడ్స్..ఇలా ఒకటేమిటి ఎన్నో బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ మన సినీ తారలు వందల కోట్లను సంపాదిస్తున్నారు. అయితే, ఇందులో సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) కొన్ని స్పెషల్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దీని వెనక ఆయన భార్య నమ్రత(Namratha) ప్రోద్బలం ఎక్కువగా ఉంది.
నమ్రత, మహేష్ బాబులది ప్రేమ వివాహం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, నమ్రతకి విదేశీ కంపెనీలకి సంబందించిన పలువురు చైర్మెన్స్, సీఈఓలతో బాగా పరిచయాలున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలతో బాగా కాంటాక్స్ ఉన్నాయి. దీంతో, స్వయంగా నమ్రతనే యాడ్ ఫిలిం కంపెనీలతో చర్చలు జరిపి మహేష్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబెట్టింది. ఒక్కో యాడ్ ఫిల్మ్ కోసం మహేష్ బాగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
ఇప్పటి వరకు మహేష్ చేసిన యాడ్స్:
ఇన్‌టెక్స్ మొబైల్స్‌ని మహేష్ ప్రమోట్ చేశాడు. ఆ సమయంలో జనాలు బాగానే ఈ మొబైల్స్ కొన్నారు. కానీ, ఇది అంతగా సక్సెస్ కాలేదు. ఐడియా సెల్యులర్ బ్రాండ్‌ను కూడా మహేష్ బాబు ప్రమోట్ చేశాడు. చాలా వరకు ఇది వర్కౌట్ అయింది. ఇప్పటికీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సంతూర్ సోప్ ప్రాడెక్ట్‌ను మహేష్ ప్రమోట్ చేస్తున్నాడు. అభి బస్, బైజ్యూస్ యాప్, టీవీఎస్, రెయిన్‌బౌ హాస్పిటల్స్, థంస్ అప్, రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్స్‌ను కూడా మహేష్ ప్రమోట్ చేశాడు. ఇక, ఒక్కో యాడ్ ఫిల్మ్ కి గాను 5 నుంచి 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
ఇక, ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే, ఆయన పార్ట్ షూట్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు. 120 దేశాలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. గ్లోబల్ రేంజ్‌లో రిలీజ్ కాబోతున్న వారణాసి మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మహేష్ రెమ్యునరేషన్‌గా 150 కోట్ల వరకూ, లాభాలలో వాటా మరో 100 కోట్ల వరకూ అందుకుంటున్నట్టు సమాచారం.












