సినిమా

Tollywood: స్టార్స్ కాలేకపోయిన వారసులు!

రచన: Anshu••6 నిమిషాల పఠనం

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల కొడుకులు, స్టార్ హీరోల కొడుకులు, స్టార్ కమెడియన్స్ వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు గానీ, స్టార్ స్టేటస్ దక్కించుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. దీంతో, చాలామందికి తమ నట వారసులను స్టార్స్‌గా చూసుకోవాలన్న కల కలగానే మిగిలిపోతుంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు దగ్గర్నుంచి..రామానాయుడు మనవడి వరకూ చాలామంది ఇలాగే మిగిలిపోయారు.

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల కొడుకులు, స్టార్ హీరోల కొడుకులు, స్టార్ కమెడియన్స్ వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు గానీ, స్టార్ స్టేటస్ దక్కించుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. దీంతో, చాలామందికి తమ నట వారసులను స్టార్స్‌గా చూసుకోవాలన్న కల కలగానే మిగిలిపోతుంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు దగ్గర్నుంచి..రామానాయుడు మనవడి వరకూ చాలామంది ఇలాగే మిగిలిపోయారు.

దాసరికి తీరని లోటు ఏదన్నా ఉందంటే కొడుకే:

దర్శకరత్న దాసరి నారాయణ రావు.. మోహన్ బాబు దగ్గర్నుంచి ఎంతో మంది నటీనటులను, దర్శకులను, ఇతర టెక్నీషియన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాదాపు, అందరూ దాసరి శిష్యులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. మోహన్ బాబు ఏకంగా స్టార్ హీరోలలో ఒకరిగా, నిర్మాతలలో ఒకరిగా ఎదిగిన వైనం మనందరికీ తెలిసిందే. కానీ, దాసరి కొడుకు మాత్రం హీరోగా గానీ, దర్శకుడిగా గానీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోలేకపోయాడు. దాసరి నారాయణరావు కెరీర్‌లో ఉన్న వెలితి ఇదొక్కటే.

సూపర్ స్టార్ కృష్ణకి ఇదే జరిగింది:

జేంస్ బాండ్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ నట వారసులలో మహేష్ బాబు అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్నాడు. కెరీర్‌లో మొట్టమొదటి సారి 'వారణాసి' లాంటి గ్లోబల్ మూవీ చేస్తున్నాడు. 120 దేశాలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటం గొప్ప విశేషం. కృష్ణ కూతురు మంజుల కూడా నటిగా, నిర్మాతగా మంచి స్థానం సంపాదించుకుంది. కృష్ణ-విజయ నిర్మల వారసుడు వీకే నరేష్ కూడా హీరోగా మంచి లైఫ్ ని చూశాడు. ఇప్పుడు, క్యారెక్టర్స్ కూడా అద్బుతమైనవి చేస్తున్నాడు. అయిరే, రమేష్ బాబు మాత్రం నటుడిగా, నిర్మాతగా సక్సెస్ కాలేకపోయాడు.

దగ్గుబాటి ఫ్యామిలీలో మూడవతరం సక్సెస్ కానట్టే:

దగ్గుబాటి రామానాయుడు కొడుకుల్లో సురేష్ బాబు అగ్ర నిర్మాతగా, వెంకటేష్ అగ్ర హీరోగా వెలుగుతున్నారు. ఆ తర్వాత రానా కూడా హీరోగా, నిర్మాతగా సెటిల్ అయ్యాడు. హోస్ట్‌గానూ రానా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ, రానా తమ్ముడు, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ మాత్రం హీరోగా సక్సెస్ కాలేదు.

అక్కినేని ఫ్యామిలీలో:

అక్కినేని ఫామిలీలో సుశాంత్ హీరోగా సెటిల్ కాలేదు. సుమంత్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. కానీ, స్టార్ అనే ట్యాగ్ కి దూరంగా ఉండిపోయాడు. అఖిల్ కూడా స్టార్ అన్న పదం దక్కించుకోలేపోయాడు.

మెగా హీరోలలో:

మెగాస్టార్ చిరంజీవి తర్వాత నాగబాబు నిర్మాతగా నటుడిగా సత్తా చాటాడు. పవన్ కళ్యాణ్ ఏకంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పవన్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఉండే హడావుడి, అలజడి ఊహించలేనిది. అది, ఒక్క పవర్ స్టార్‌కి మాత్రమే సాధ్యమైంది. రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. కానీ, మిగతా మెగా హీరోలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేదు.

మంచు ఫామిలీలో కూడా:

మంచు మోహన్ బాబు ఎంతో కష్టపడి నటుడిగా నిర్మాతగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ, ఆయన వారసులు మాత్రం ఆ స్థాయికి రాలేకపోయారు. నిర్మాతలుగా, నటులుగా కొనసాగుతున్నారు. కానీ, అది ఆశించిన స్థాయిలో లేకపోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలా, కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..గానీ, నిలబడలేకపోయాడు.

నందమూరి ఫ్యామిలీలో తారకరత్న హీరోగా 11 సినిమాలతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అన్ని సినిమాలు నిరాశపరిచాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా, మన టాలీవుడ్‌లో నట వారసులు అగ్ర స్థానికి చేరుకోలేకపోయారు.

#Tollywood#Successors#Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి