సినిమా

Payal Rajput: ఒక సినిమాలో ఒప్పుకుంటే అన్నీ అలాంటివే చేస్తానా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Payal Rajput: ఒక హీరోయిన్ డెబ్యూ సినిమాలో చేసిన ప్రభావం..ఆ తర్వాత సినిమాల మీద ఎంతగా పడుతుందో చెప్పడానికి, పెద్ద ఉదాహరణ పాయల్ రాజ్‌పుత్. అప్పట్లో సావిత్రి మించిన హీరోయిన్స్ ఉన్నా కూడా ఆమెకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మిగతా హీరోయిన్స్‌లా సినిమా మాత్రమే చేసి ఊరుకోలేదు. వ్యాపారంలోనూ అందవేసిన చెయ్యి. కార్రేసుంగ్‌లోనూ ఆమెను మించిన వాళ్ళు లేరని నిరూపించుకున్నారు.

అలా, సావిత్రి ఇండస్ట్రీలో పాత్రల పరంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సౌందర్య సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకుంది. అలా, వాళ్లు చేసిన సినిమాలతో కెరీర్ అద్భుతంగా మలుచుకున్నారు. ఇక, కొందరు హీరోయిన్ అవ్వాలని వచ్చి స్పెషల్ సాంగ్స్‌కే పరిమితం అయిపోతారు. కొందరు నటీమణులు హీరోయిన్ అవుదామని వచ్చి..వ్యాంప్ క్యారెక్టర్‌తో సరిపెట్టుకుంటారు.

పాయల్ రాజ్‌పుత్ కూడా ఇలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయింది. ఆమె నటించిన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్‌గా పాయల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో పాయల్ పర్ఫార్మెన్స్ కి ఫిదా కానివారు లేరనే చెప్పాలి. రొమాన్స్‌లోనూ, కన్నింగ్ పర్ఫార్మెన్స్‌లోనూ, ఎమోషన్స్ చూపించడంలో అద్భుతంగా నటించింది.

ఈ సినిమా తర్వాత పాయల్‌కి హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయనుకుంది గానీ, వచ్చిన రోల్స్ అన్నీ కూడా రొమాంటిక్ క్యారెక్టర్, లిప్ కిస్సుల కోసమే కథ రాసి వచ్చి చెప్తారని ఊహించలేదు. ఆర్ ఎక్స్ 100 తర్వాత దాదాపు 70 నుంచి 80 కథలు విన్న పాయల్‌కి మైండ్ బ్లాకైంది. ఆమెకి కథ చెప్పడానికి వచ్చిన ప్రతీ ఒక్కరు..కథ ఇది..ఇన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి..ఇన్ని లిప్ కిస్సులుంటాయనే చెప్పారు..తప్ప ఈ కథలో మీ పాత్ర హీరోయిన్‌గా ఇంత బలంగా ఉంటుంది అని మాత్రం చెప్పలేదట. ఒకదశలో, అసలు కథలు వినడానికి విసుగొచ్చిందని తెలిపింది. ఆ సినిమా ప్రభావం ఒకరకంగా పాయల్ ని స్టార్ హీరోయిన్ కాకుండా అడ్డుపడింది. వచ్చిన నాలుగైదు సినిమాలు కూడా పాయల్ రేంజ్‌ను మార్చలేకపోయాయి.

#Payal Rajput#RX 100#Ajay Bhupathy#Karthikeya#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి