సినిమా

Allu-Lokesh: అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Allu-Lokesh: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతీ విషయంలో ముమ్మరంగా ఉంది. ఒక చిన్న విషయం కూడా నిజమో అబద్దమో తెలియకుండానే వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలకి సంబందించిన విషయం ఐతే మరీ దారుణం. ఏకంగా, భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనే ప్రచారం చేసేస్తున్నారు. ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ అయింది. అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని వార్త వచ్చి వైరల్ అయింది. ఇది, మరీ విస్తృతం అవడంతో అల్లు అర్జున్ పిఆర్ టీమ్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది?

ప్రస్తుతం, అల్లు అర్జున్ 'రాకా' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ముంబైలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతోంది. మాఫియా నేపథ్యంలో అల్లు అర్జున్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తున్నాడట అట్లీ. ఇతర కీలక పాత్రల్లో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే వారణాసి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫ్యామిలీతో విదేశాలకి టూర్ వెళ్ళాడు. ఈ సినిమా పూర్తి కావడంతో నెక్స్ట్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.! అంటూ వార్తలు మొదలై..పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలో నిలిచాయి. ఆ లిస్ట్‌లో లోకేష్ కనగరాజ్ పేరు వచ్చింది. లోకేష్..ఓ పవర్ ఫుల్ స్టోరీని మహేష్ కోసం రెడీ చేసినట్టు..త్వరలో, వీరి కాంబో సినిమాపై అప్‌డేట్ రానున్నట్టు వార్తలు వచ్చాయి.

దీంతో, అల్లు అర్జున్‌తో లోకేష్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని..అదే కథను మహేష్ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని..వారణాసి తర్వాత నెక్స్ట్ సినిమాను లోకేష్‌తోనే చేయబోతున్నాడని అంతటా ప్రచారం జరిగింది. దీంతో, అల్లు అర్జున్-లోకేష్‌ల ప్రాజెక్ట్ నిజంగానే క్యాన్సిల్ అయిందని అందరూ నమ్మారు. దీంతో, స్వయంగా అల్లు అర్జున్ పిఆర్ టీమ్ రెస్పాండ్ అయింది. అల్లు-లోకేష్‌ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని..ఇవన్నీ కేవలం రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, త్వరలోనే ఈ కాంబోలో ప్రాజెక్ట్‌ను పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలు పెట్టబోతున్నారు.

#Allu Arjun#Lokesh Kanagaraj#Kollywood#Latest Cinema Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి