సినిమా

Srinidhi Shetty: శ్రీనిధి విషయంలో ముందు నుంచీ అదే రూమర్స్!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Srinidhi Shetty: పాపం కొందరు హీరోయిన్స్ కి అనవసరమైన రూమర్స్, నెగిటివీతో కెరీర్ డ్యామేజ్ అవుతుంది. కొందరికి ఆశించిన అవకాశాలు రాకుండా పోతాయి. డెబ్యూ సినిమా భారీ హిట్ సాధించిందంటే ఆ తర్వాత ఎవరికి వాళ్ళు, ఈ హీరోయిన్ ఇంత డిమాండ్ చేస్తుందట..అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. దాంతో, అసలు వాస్తవాలు తెలుసుకోకుండా మేకర్స్ అప్రోచ్ అవడం మానేస్తారు. బహుషా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కెరీర్‌లో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

కన్నడ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించాడు. హెవీ యాక్షన్ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీతో పాటు విడుదలైన మిగతా చోట్ల కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో యష్ ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ సిరీస్ అంతకుమించిన భారీ విజయాన్ని అందుకుంది.

అయితే, ఈ రెండు భాగాలలో హీరోయిన్‌గా నటించిన కన్నడ భామ శ్రీనిధి శెట్టి, తన పర్ఫార్మెన్స్‌తో సౌత్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఇటు టాలీవుడ్ అటు శాండిల్ వుడ్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ, శ్రీనిధి మాత్రం చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆ సమయంలో అందరూ అనుకుంది..రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుందీ అని. ఇదే మాట బాగా ప్రచారం జరిగింది.

దాదాపు, 10-15 సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే.. కేవలం రెమ్యునరేషన్ డిమాండ్ చేసే వదులుకుందని చెప్పుకున్నారు. ఇప్పుడు, కూడా ఈ ప్రచారమే జరుగుతోంది. తెలుగులో హిట్ 3, తెలుసు కదా సినిమాలు చేసింది. మొత్తానికి.. అటు కన్నడ, ఇటు తెలుగు కలిపి 4 సినిమాలే చేసింది. వెంకటేష్ సరసన నటిస్తున్న ఆదర్శ కుటుంబం 5వ సినిమా. ఈ 5 సినిమాలకే 8 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని ..ఇప్పుడు ఇంకా పెంచబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా, దీనిపై శ్రీనిధి శెట్టి స్పదించింది. నాకంత సీన్ లేదు. నేను చేసిందే చాలా తక్కువ సినిమాలు. ఒక్కో సినిమాకి 7-8 కోట్లు ఎలా డిమాండ్ చేస్తాను..ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. డబ్బు కోసమే అయితే, ఇప్పటికే 20 సినిమాలకి పైగానే చేసేదాన్ని. కానీ, నాకు మంచి పాత్రల్లో నటించడం ఇష్టం తప్ప రెమ్యునరేషన్ కాదు..అని ఈ కన్నడ కస్తూరి తెలిపింది. పాపం, నిజంగానే శ్రీనిధి 8 కొట్లు అడుగుతుందని నమ్మి ఎంతమంది నిర్మాతలు సైలెంట్ అయ్యారో..ఎంతమంది దర్శకులు పక్కన పెట్టారో..ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేజారిపోయాయో.

#Srinidhi Shetty#KGF#Yash#Prashanth Neel#Venkatesh#Aadarshakutumbam#Trivikram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి