సినిమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఆవేదన..కారణం ఇదేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Vijay Devarakonda: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో 'తొక్కేస్తున్నారు' అనే పదం చాలామంది స్టార్స్ వాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయ్ కిరణ్‌ని మెగాస్టార్ చిరంజీవి తొక్కేశాడని..అందుకే, మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల, ఓ ఈవెంట్‌లో కూడా చిరు ఈ మాటచెప్పి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ప్యారడైజ్ సినిమా ఈవెంట్‌లో మంచు మోహన్ బాబు కూడా ఇదే మాట అంటూ కామెట్స్ చేశాడు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా, ఆయన నటించిన రణబాలి సినిమా ప్రెస్‌మీట్‌లో తనపై వస్తున్న నెగిటివ్ ప్రచారం, కామెంట్స్ గురించి ఎమోషనల్ అయ్యాడు. కావాలనే, తనని కొందరు ట్రోల్ చేస్తున్నారని బాధపడ్డాడు. ఒకప్పుడు, బండ్ల గణేష్-విజయ్ ల మధ్య ఇలాంటి చర్చ జరిగింది. ఒక హిట్ రాగానే ఆటిట్యూడ్ మారిపోతుందని విజయ్ ని ఉద్దేశించి బండ్లన్న మాట్లాడాడు. దీనికి, విజయ్ కౌంటర్ ఇచ్చాడు.

అయితే, విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతూ వస్తున్నాయి. ఏ జానర్ సినిమా చేసినా ఎందుకో జనాలకి నచ్చడం లేదు. దాంతో, సినిమా ఫ్లాప్ అనగానే విజయ్ మీద సోషల్ మీద నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సినిమా రిలీజ్ సమయంలో ముందుగానే ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా విజయ్ ఫీలయ్యాడు. ఇప్పుడు, కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 రణబాలితో పాటు రిలీజ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో విజయ్ టోలర్స్, నెగిటివ్ కామెంట్స్ రాసేవాళ్ళ గురించి మాట్లాడాడు. జైలర్ 2 చూడండి..రణబాలి చూడకండీ అని ఒక 50 వీడియోలు వస్తాయి..అంటూ మనసులోని బాధను వెల్లడించాడు. ఒక సినిమా కోసం ఎంతగా శ్రమిస్తామో అవతలి వాళ్ళకి అనవసరం..సింపుల్‌గా ఒక మాట అనేస్తారు..నా మీద నెగిటివ్‌గా ప్రచారం చేస్తే ఏమొస్తుందీ..? అంటూ ఆవేదన చెందాడు. నిర్మాత రవి కూడా విజయ్, రణబాలి సినిమా కోసం 100 రోజుల పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నాడని..సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి, విజయ్...తనపై వస్తున్న తప్పుడు వార్తల గురించి బాగా హర్ట్ అయ్యాడు. మరి, వీటికి సమాధానంగా రణబాలి హిట్ అవుతుందా లేదా చూడాలి.

#Vijay Devarakonda#Ranabaali#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి