సినిమా

Sharwanand: శతమానంభవతి తర్వాత మళ్ళీ శర్వాకి భోగి సినిమానే మైల్ స్టోన్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Sharwanand: టాలీవుడ్‌లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆయన, సినిమా కథలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయనే విషయం..ఆ సినిమాలను చూస్తే గానీ అర్థం కాదు. ప్రస్థానం సినిమాతో శర్వా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగతా మిడ్ రేంజ్ హీరోల్లా కమర్షియల్ సినిమాల మీద పడకుండా కంటెంట్ ఉన్న సినిమాలను..ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

Sharwanand: టాలీవుడ్‌లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆయన, సినిమా కథలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయనే విషయం..ఆ సినిమాలను చూస్తే గానీ అర్థం కాదు. ప్రస్థానం సినిమాతో శర్వా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగతా మిడ్ రేంజ్ హీరోల్లా కమర్షియల్ సినిమాల మీద పడకుండా కంటెంట్ ఉన్న సినిమాలను..ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'.. లాంటి సినిమాలు నటుడిగా శర్వాకి చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక, శర్వా కెరీర్‌లో శతమానంభవతి ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా. ఈ సినిమా రిలీజైనప్పుడు ఒకవైపు చిరంజీవి, ఇంకోవైపు బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా ఆ బిగ్ స్టార్స్ కంటే శర్వా లాంటి మీడియం హీరో సినిమాకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కుటుంబ కథా చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఇది, శర్వాకి బాగా కలిసి వచ్చింది.

అయితే, మళ్ళీ ఇలాంటి సాలీడ్ హిట్ మన ఛార్మింగ్ హీరోకి దక్కలేదు. గత చిత్రం బైకర్ ఓ ఛాలెంజింగ్ సినిమా. కానీ, ఆశించిన సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు, సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమాను చేస్తున్నాడు. పీరియాడికల్ సినిమాగా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈ ముగ్గురు మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉంది.

గత కొంతకాలంగా, దర్శకుడు సంపత్ నందికి సక్సెస్ లేదు. వీరిద్దరు ఎంతో కసితో ఈ సినిమాను చేస్తున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. నవంబర్ 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఎప్పుడో వచ్చిన శతమానంభవతి సినిమా శర్వాకి మైల్ స్టోన్‌లా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ భోగి సినిమా అలాంటి పెద్ద హిట్ అవుతుందని యూనిట్ మొత్తం చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా, శర్వాకి ఈ సినిమా సక్సెస్ అవడం చాలా చాలా ముఖ్యం.

#Shatamanam Bhavati#Bhogi#Sharwanand#SampathNandi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి