Spirituality

మాంసం తింటే గుడికి వెళ్ళకూడదా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

నాన్ వెజ్ తిన్న రోజు ఆలయానికి వెళ్ళకూడదని పెద్దలు అంటారు. ఇలా చెప్పడం వెనక ఉన్న భావం ఏమిటో చాలా మందికి తెలియదు..

మనిషికి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ కోపతాపాలు ఎందుకు వస్తాయో ఎవరైన ఆలోచించారా? ఇలాంటివి మాత్రం ఆలోచించరు. కోపం వస్తే మాత్రం ఏం చేయకుడదో అదే చేసేస్తారు. ఇది మనిషికున్న నైజం. ఇకపోతే దైవం అనే భావన చాల పవిత్రమైనది.

మనిషిలోని మనసును నియంత్రించే శక్తి దైవ ఉపాసకులకు చాల తేలిక అలవడుతుందని చెబుతారు. వారు నియమనిష్టలతో ఉంటూ గంతులువేసే మనసుని భక్తి అనే కొరడాతో దేవుడు అనే భయాన్ని పెట్టి అదిలిస్తుంటే క్రమక్రమంగా చెప్పినట్టు వింటుందని అంటారు..

అలాగే మనిషిలో ఉన్న కొన్ని చెడుగుణాలు మనసుని రెచ్చగొడుతుంటాయి. అవి మనం తీసుకునే ఆహర పదార్ధాలవల్ల కావచ్చూ లేదా.. మనం ఉన్న ప్రదేశం తాలుకూ ప్రభావం వల్ల కావచ్చూ.. లేదా పెరిగిన వాతారణం వల్ల కావచ్చు.. అందుకే పెద్దలు, గురువులు మనలో చెడును ప్రేరేపించే వాటిని దూరం చేసుకోమన్నారు. ఇందుకోసం ఆయాసమయాల్లో మాలాధారణ వంటి ఆచారాల ద్వారా మనస్సును నియంత్రించేలా ఏర్పాటు చేశారు.

మొత్తానికి ఇలా చెడుకు దూరంగా ఉండటం వల్ల మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుందనేది వారి భావన. అలా వచ్చిందే మాంసం తిని ఆలయానికి వెళ్ళకూడదు అనే ఆచారమని పండితులు చెబుతారు. అదేవిధంగా గుడ్డు, మాంసం రజో గుణ, తమో గుణ సంబంధమైన పదార్థాలుని, ఇవి తినడం వలన మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోయి, కామ వికార కోరికల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఫలితంగా మంచి ఆలోచనల బదులు చెడు ఆలోచనలు రావడం జరుగుతుందట.. మానవుడు ఎప్పుడైనా తన మనశాంతి కొరకు దేవాలయంలోని దేవుడి దగ్గరికి వెళ్తాడు. చాలా మంది ఉదయానే స్నానం చేసి ఎలాంటి పదర్థాలు తినకుండానే ఆలయాలకు వెళ్ళడం వల్ల వారికి అక్కడ ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అలాగే గుడ్డు, మాంసం తిని ఆలయానికి వెళ్లడం వల్ల మనసు ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ఫలితంగా దేవుడి పై భక్తి అనేది మనస్ఫూర్తిగా కలగక గింజుకుంటుందని అంటారు. కాబట్టి ఆలయానికి గుడ్డు, మాంసం లాంటివి తిని వెళ్ళకూడదని పెద్దలు అంటారు.

మరోవైపు శాస్త్రాల కంటే ముఖ్యమైనది భక్తి, వినయం, మనసు పవిత్రంగా ఉండటం అని చాలామంది భావిస్తారు. కాబట్టి, మీ కుటుంబ ఆచారాలను గౌరవిస్తూ, మీ విశ్వాసానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

#india#telangana#AP#temple#eating meat#egg#visit#lord shiva
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి