విలువైన భూములను ఈజీగా కొట్టేస్తున్నా అంతా గప్ చుప్
నాయకుల వేషంలో బాడా బాబుల డ్రామాలు
రాజకీయ పార్టీల కోసం ఇలాంటి భూములే అవసరం
వేల కోట్ల ప్రభుత్వ భూముల్లో అందరు కలిసి పాగా
2009లో ఇచ్చిన ఆర్డర్‌ను అనుకూలంగా మార్చుకున్న వైనం?
లక్షల కోట్లలో రాజకీయ నాయకుల వాటా ఎంత?
లక్షలాది చెట్లు నరికినా ఒక్క నాయకుడు కూడా ఎందుకు ప్రశ్నించలేదు?
1961లో రిజర్వ్డ్ ఫారెస్ట్, డీ నోటిఫై చేసిందనే డ్రామాలతో విచ్చలవిడితనం
మీకు వాటాలు మీకు అందింతే చాలా.. ఏమీ కనిపించవా?
కూకట్ పల్లి భూములపై కోట్లాది రూపాయల మూతులు నాకుతున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ పార్ట్ 4 కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ చైర్మన్, 9848070809
ఇక్కడ కనిపిస్తున్న గూగుల్ మ్యాప్స్ ఫోటోలను జాగ్రత్తగా గమనించండి. కూకట్ పల్లి భూముల్లో 2019 నుంచి 2026 వరకు జరిగిన మార్పులను గమనించారా? లక్షలాది చెట్లు నరికినా ఏ పకృతి ప్రేమికులు పట్టించుకోకపోవడంతో ఇలా తయారైంది. లక్ష 33 వేల ఫైర్ హుడ్ కొట్టినా అడగ లేదు. 33 లక్షలు పెనాల్టీ వేసినా ఏ ఒక్కరు వీడియోలు బయటపెట్టలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. నాయకుల ఖర్చులను చూస్తుంటే వాళ్ల చెట్లకు పూలు, పండ్లు కాకుండా పైసలు కాస్తాయా అని అనుకుంటాం. వాటితోనే ఆఫీసర్స్‌ని, ప్రతిపక్ష పార్టీలను, మీడియాను, ప్రజలను డబ్బుల మాయలో ముచ్చేస్తుంటారు. వాటికి సేవ అనే ఒక్క పదం కలిపి వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తారు. లక్షల్లో బిజినెస్ చేసుకుంటారు. దీనికి కూకట్ పల్లిలోని 333 ఎకరాల భూములే ఉదాహరణ. ప్రజలకు చెందాల్సిన ల్యాండ్‌ని ప్రజల తరుఫున ఆనాటి వైఎస్‌ఆర్ సర్కార్ ఎలా కొట్టేసిందో స్వేచ్ఛ దేవేందర్ రెడ్డి ఇప్పటికే వార్తలు రాసి ప్రజల ముందు ఉంచారు. ఆ తర్వాత కేసీఆర్ భూమిని ఎలా దోచుకున్నారో కూడా వివరించారు. అందరిపై పోరాటం అని ఈ కూకట్ పల్లి ఇండస్ట్రీ భూములపై ఇప్పుడు రేవంత్ ఎలా వేల కోట్లు వసూలు చేసుకుని రాజకీయం చేస్తున్నారో నిజాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.
బంగారు బాతును కోసుకుని తిన్నారు
కూకట్ పల్లిలో ఐడీఏ కోసం 850 ఎకరాలు ఇచ్చారు. అందులో ఉదాసీన్ మఠ్ భూములు 538.11 గుంటలు లీజ్ తీసుకున్నారు. పేదలకు కేటాయించిన భూముల్లో అక్వైర్డ్ చేసిన భూమి 152.03 గుంటలు, ఈ భూమి కొనుగోలు చేశామని ఆ కంపెనీ చెప్పుకుంటున్నా, రికార్డుల్లో స్పష్టత లేదు. ఫారెస్ట్ ల్యాండ్‌ని డీ నోటిఫై చేసి 170.04 గుంటలు ప్రభుత్వం ఇచ్చింది. ఇదంతా కూడా ప్రభుత్వ అసైన్డ్, ఇనాం, డీ నోటిఫైడ్ ల్యాండ్. ఇలా 850.18 గుంటల్లో ఐడీఎల్ కంపీనీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆ కంపెనీ ఏర్పాటు చేసింది కేవలం 150 ఎకరాల్లోనే కాని గోడ పెట్టుకుంది మాత్రం 900 ఎకరాలకు పైగానే.
సర్వే నెంబర్స్ ఇలా ఉన్నాయి
1965లో జీవో నెం. 1314 ప్రకారం ఇచ్చిన భూముల్లో 2009లో 100 ఎకరాలు క్లియర్ నాలెడ్జ్ హబ్ కోసం నాన్ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీగా మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ సర్వే నెంబర్ 629లో 8 ఎకరాలు, 1011/1, 2, 3, 4, 1011/12లో 18.38 గుంటలు క్లియర్ చేశారు. ఈ భూమిని ఇచ్చేశారని నేతలు అంతా కలిసి 2021లో కుట్రలు పన్నారు. దీంతో అమోయ్ కుమార్ మొత్తం 333 ఎకరాలకు ఇదే సర్వే నెంబర్స్‌లో ఇచ్చేశారు. ఎలాంటి రూపాయి ప్రభుత్వానికి చెల్లించకుండానే తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఎవరూ పట్టించుకోరేం?
ఫినిక్స్ చేసిన ఈ బినామీ వ్యాపారం కాస్తా ఇప్పుడు ఎక్కడికో దారి తీసింది. ఆ తర్వాత హిందుజా కంపెనీ వాళ్లు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌తో కుటుంబ రిలేషన్ షిప్ ఉండడంతో అందరూ కలిసి తక్కువగా భూములను కొట్టేశారని స్పష్టం అవుతోంది. స్వేచ్ఛ ఎప్పటికప్పుడు ఈ భూములపై వార్తలు అందిస్తూ ఉంటుంది.












