National

oil Exports : కేంద్రం సంచలనం.. ఇంధన ఎగుమతులపై భారీ సుంకం

రచన: Kumar3 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మరోసారి అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం భీకరస్థాయికి చేరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ చమురు కంపెనీల ఎగుమతులపై నియంత్రణ విధించాలని నిర్ణయించింది.

అందుకే డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (విమాన ఇంధనం) ఎగుమతులపై విధించే అదనపు పన్నును ఏకంగా రూ. 7 మేర పెంచింది. ఫలితంగా ఇప్పటివరకు లీటర్‌పై రూ. 8.5గా ఉన్న పన్ను ఒక్కసారిగా రూ. 15.5కు చేరుకుంది. పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును మాత్రం లీటర్‌కు రూ. 4 నుంచి రూ. 2.5కి తగ్గిస్తూ సామాన్యులకు కొంత ఊరటనిచ్చింది. ఈ సవరించిన కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రంలోని మోడీ సర్కార్ స్పష్టం చేసింది.

గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నందున దేశీయంగా మరోసారి ప్రభావం పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. వాటిపై కేంద్రం సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. అందుకే దేశంలో నిల్వలు తగ్గకుండా ఉండేందుకు మన రిఫైనరీలు స్థానిక మార్కెట్లను కాదని విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు గడించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

కేంద్రం ఎగుమతులపై పన్నులు పెంచినప్పటికీ, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇదిలాఉండగా, గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండటం వలన సమీప భవిష్యత్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగొచ్చనే ఆందోళనలు కనిపిస్తున్నాయి.

#oil#exports#ban#impose#central government#tax hike
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి