రాజకీయాలు

KTR : మేం అధికారంలోకి వస్తే మెట్రోను 400కి.మీ పొడగిస్తాం :కేటీఆర్

రచన: Kumar3 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో పేరిట డ్రామాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులకు నీళ్లివ్వాలని అడిగితే నెత్తురు చల్లితే పంటలు వస్తాయని సీఎం స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడటం సరికాదని కేటీఆర్ హితవు పలికారు

కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో పేరిట డ్రామాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులకు నీళ్లివ్వాలని అడిగితే నెత్తురు చల్లితే పంటలు వస్తాయని సీఎం స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడటం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టంచేశారు. రైతులు, ప్రజలు రేవంత్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మెట్రో రైలును 400 కిలోమీటర్లు పొడిగిస్తామని పేర్కొన్న కేటీఆర్.. కేవలం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్, బీజేపీ మెట్రో పేరిట డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఆనాడు మేము అడిగినప్పుడు లక్డీకాపూల్ నుండి BHEL మెట్రోకు బీజేపీ అనుమతి ఇవ్వలేదని.. అవసరం లేని రూ. 14 వేల కోట్ల L&T అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద రుద్దుతుంది వెల్లడించారు.

బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు దాని మీదే డ్రామాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇలాగే డ్రామాలు చేస్తూ వస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మెట్రో ప్రాజెక్టు మళ్లీ పరుగులు పెడుతుందన్నారు. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వేల్లో ఇదే విషయం వెల్లడైందని, అందుకే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద వ్యతిరేకత నానాటికీ పెరుగుతోందన్నారు.

#KTR#BRS#congress#Cm revanthreddy#metro#bjp
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి