ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ -2026 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది.ఈ సారి డిఫెడింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా .. ఈ టోర్నీలోనే ఫైనల్‌కు చేరిన ఫస్ట్ సాకర్ టీమ్‌గా నిలిచింది. ఈ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజంగా పేరొందిన మెస్సీ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఆయన సారథ్యంలో మరోసారి అర్జెంటీనా జట్టు సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.
సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో మొదట 1-0 తేడాతో వెనుకబడిన అర్జెంటీనా.. చివరలో ఆటను తమవైపునకు తిప్పుకుంది. 7 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి.. ఇంగ్లాండ్‌పై సూపర్ విక్టరీ అందుకుంది. అటు మెస్సీ అందించిన రెండు అసిస్ట్‌లను ఫెర్నాండెజ్, మార్టినెజ్ గోల్స్‌గా మలిచారు.
దాంతో అర్జెంటీనా జట్టు సెకాండాఫ్ ముగిసే సరికి 2 గోల్స్ సాధించి విక్టరీని అందుకుంది. మొత్తానికి ఫైనల్‌కు చేరుకుంది. ఓటమి కారణంగా ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు .. అర్జెంటీనా జట్టు ఆటగాళ్లతో గొడవకు దిగినట్టు తెలిసింది.ఇంగ్లండ్ జట్టులోని ఓ ప్లేయర్.. ప్రత్యర్థి అర్జెంటీనా జట్టు ప్లేయర్‌ను తల మీద కొట్టడంతో అతడు కిందపడిపోయినట్టు సమాచారం.
కాగా, 20న అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. న్యూ జెర్సీలోని ప్రసిద్ధ న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుండగా..ఫైనల్లో గెలవాలని అటు అర్జెంటీనా.. ఇటు స్పెయిన్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. కాగా, ఈసారి అర్జెంటీనా జట్టుకు రిఫరీలు సాయం చేస్తున్నారిన పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ జట్టును బ్యాన్ చేయాలని నెట్టింట్ డిమాండ్లు వినిపిస్తున్నాయి.












