National

TMC : అప్పటివరకు బతికేఉంటా.. మమతాబెనర్జీ శపథం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బెంగాల్ ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.అయితే, అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బెంగాల్ ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.అయితే, అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ పార్టీని రెండు ముక్కలు చేసేందుకు రెబల్స్ కంకణం కట్టుకున్నట్టు సమాచారం. పార్లమెంటులో సగం మంది టీఎంసీ ఎంపీలు సొంత కుంపటి పెట్టుకున్నారు. వారంతా ఓ పార్టీలో కలిశారు. టీఎంసీ పార్లమెంటరీని విలీనం చేసి నిజమైన ఎంపీలు తామేనని..పార్టీ గుర్తు, పార్టీకి వచ్చి ఫండ్స్ మొత్తం తమకే చెందాలని లోక్‌సభ స్పీకర్, ఈసీకి వినతి చేసినట్టు తెలుస్తోంది.

బెంగాల్లో మొన్నటివరకు రౌడీలు రాజ్యమేలగా ప్రస్తుతం వారిని సువేంధు ప్రభుత్వం ఏరివేస్తున్నది. గతంలో రౌడీయిజం, దౌర్జన్యాలు చేసిన వారిని పట్టుకుని జైలులో వేస్తున్నది. ఇక బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను గుర్తించి వారిదేశానికి పంపిస్తున్నది.ఇండో,బంగ్లా బోర్డర్‌లో ఆర్మీ సాయంతో కంచె వేయిస్తున్నది.

బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు, టీఎంసీ పార్టీ రెండు ముక్కలు కావడంపై మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె చాలా ఆందోళనగా కనిపంచారు. పార్టీ తన చేతుల్లో నుంచి జారిపోయిందనే ఆవేదన, గద్గద స్వరంతో మాట్లాడారని పలువురు పేర్కొంటున్నారు.

టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ రెబెల్స్ క్యాంప్‌లో చేరాక.. వీడియో రిలీజ్ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటానని చెప్పారు. టీఎంసీ పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చంటూ తెగేసి చెప్పారు. తనకు హార్ట్ ఎటాక్ రావాలని బీజేపీ కోరుకుంటోందని.. కానీ, బీజేపీ అంతం చూసేదాకా తాను బతికే ఉంటానన్నారు. ఇప్పటికీ లోక్‌సభ, రాజ్యసభల్లో.. 18 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారని.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికైనా సిద్ధమేనని ఆమె చాలెంజ్ విసిరారు.

https://x.com/pulsenewsbreak/status/2077566637075538188?s=20

#TMC party#mamatha benarji#westbengal#political crisis#national
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి