రాజకీయాలు

Raja Singh : కల్మా చదవాలని హుకుం జారీ చేస్తారా? : రాజాసింగ్

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో కమ్యూనిటీ వివాదం వెలుగులోకి వచ్చింది. హిందూ విద్యార్థులు కల్మా చదవాలని ఓ ప్రయివేటు పాఠశాలలోని టీచర్లు హోం వర్క్ ఇవ్వడంపై పిల్లల పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి టీచర్లను గట్టిగా నిలదీశారు.

రాష్ట్రంలో మరో కమ్యూనిటీ వివాదం వెలుగులోకి వచ్చింది. హిందూ విద్యార్థులు కల్మా చదవాలని ఓ ప్రయివేటు పాఠశాలలోని టీచర్లు హోం వర్క్ ఇవ్వడంపై పిల్లల పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి టీచర్లను గట్టిగా నిలదీశారు. అసలు పిల్లలకు ఇలాంటి హోంవర్క్ ఇస్తారా? అంటూ మండిపడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్లల పుస్తకాల్లో కల్మా, సురా ఫతే చదవాలని టీచర్ అసైన్ చేసినట్టు ఉంది.

పాతబస్తీలోని సైదాబాద్‌ సక్సెస్ స్కూల్‌లో గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదే పాఠశాలలో సెకండ్ క్లాస్ చదువుతున్న విద్యార్థినికి కల్మా చదవాలని, నేర్పించేందుకు టీచర్లు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో హిందూ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం హుకుం జారీ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకుని తక్షణమే పాఠశాలకు చేరుకున్న పేరెంట్స్ యాజమాన్యాన్ని నిలదీశారు.

https://x.com/RTVnewsnetwork/status/2077598715276304405?s=20

హిందూ విద్యార్థినితో కల్మా చదివించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.ఈ ఘోర ఉదంతంపై గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాఠశాల బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి, పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఇటీవంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

#kalma#surah fateh#teahcers#assign#reading homework#oldcity#mla rajaasingh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి