రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో రోజుకో సమస్య వెలుగులోకి వస్తున్నది. మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరగగా.. తాజాగా తాగు నీటి సమస్య కోసం విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు.నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థినుల ఆందోళనకు దిగారు.నెల రోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.వాష్‌రూమ్‌లు, బాత్రూమ్‌లలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. "రూ.10 చెల్లిస్తేనే రిపేర్లు చేస్తామని హెచ్‌ఎం చెప్పారని" విద్యార్థినుల ఆరోపిస్తున్నారు. తాగు నీరు అడిగితే ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.
https://x.com/TNewsTelugu/status/2077633471091286157?s=20
ఇదిలాఉండగా, విద్యకోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, తెలంగాణ మోడల్ స్కూల్స్,యంగ్ ఇండియా స్కూల్స్ కట్టిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. కానీ, గురుకులంలోని సమస్యలు పరిష్కరించడంలో మాత్రం సర్కార్ ఫెయిల్ అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ ప్రస్తుతం తనే వద్దే ఉందని, సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపిస్తానని సీఎం చెప్పేమాటలు నీటి మీద రాతలు లాగే ఉన్నాయని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.












