ఏపీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన బోటు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అందులో సుమారు ఆరుగురు జాలర్లు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కేవలం బోటు డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అతన్ని నేవి సిబ్బంది రక్షించి చికిత్స అందించిన అనంతరం తీరానికి చేర్చారు.
ఇంతకీ బోటు ప్రమాదం ఎలా జరిగింది? మత్స్యకారులు ఎలా గల్లంతు అయ్యారన్న విషయం కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. కనిపించకుండా పోయిన మత్స్యకార కుటుంబాలు తమ వారికోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వం సైతం వారికి సహాయసహకారాలు అందిస్తున్నట్టు సమాచారం..
https://x.com/greatandhranews/status/2077620031157080343?s=20
ఇదిలాఉండగా, విశాఖలో మరో ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, తోటి మత్స్యకారులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.ఈ ఘటనతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు భయపడుతున్నట్టు సమాచారం. అలల ధాటికి బోట్లు తిరగబడుతున్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు.












