వైసీపీ కీలక నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై మరో బిగ్‌షాక్ తగిలింది.నిన్న కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వైసీపీ నేతలు, అంబటి రాంబాబు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి గల కారకుల్లో అంబటి ఒకరు. ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, పోలీసుల విధులకు పదే పదే అంబటి అడ్డుతగిలారని సమాచారం.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు ఫైల్ చేశారు. ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇస్తుండగా తమను నెట్టివేశారని ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై BNS132, 3(5) సెక్షన్ల కింద కేసు పెట్టారు. ముద్రగడ అంత్యక్రియల్లో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారు. పెద్దఎత్తున తోపులాట జరిగింది.
ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబం నిర్ణయం మేరకే అంత్యక్రియలు జరగాలని పేర్కొన్నారు. అప్పటికే ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేయగా.. ఆయన్ను కాల్చవద్దని పూడ్చాలని అక్కడ కాస్త గొడవ జరిగింది. ఈ క్రమంలో అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులను నెట్టివేసినట్టు తెలిసింది. దీంతో తమ విధులకు ఆటకం కలిగించారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.












