National

Bypolls : బకీంపూర్‌లో బీజేపీకి షాక్.. ప్రశాంత్ కిషోర్ ముందంజ

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశంలోని వివధి రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన మూడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మూడ్రోజుల కిందట ఉప ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఆ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని బకీంపూర్, గుజరాత్‌లోని మంజర్ పూర్, మధ్యప్రదేశ్ లోని దాటియా అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయ 8 గంటలకే ప్రారంభం అయ్యింది.

దేశంలోని వివధి రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన మూడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మూడ్రోజుల కిందట ఉప ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఆ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని బకీంపూర్, గుజరాత్‌లోని మంజర్ పూర్, మధ్యప్రదేశ్ లోని దాటియా అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయ 8 గంటలకే ప్రారంభం అయ్యింది. అయితే, తమకు కంచుకోటగా భావించిన బకీంపూర్‌లో బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ఫలితాల ప్రకారం 5వ రౌండ్ ఫలితాలు ముగిసే సమయానికి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‍ 8,971 ఓట్లు సాధించి 2,319 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమికి చెందిన అభ్యర్థి నీరజ్ కుమార్ 6,652 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి 1,534 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బకీంపూర్‌లో మొత్తం 31 రౌండ్లకు గాను కేవలం 5 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బకీంపూర్‌ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా చెబుతుంటారు.

తాజాగా ఫలితాల్లో ఇక్కడ ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం సాధించడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదని తెలుస్తోంది.అయితే, ప్రశాంత్ కిశోర్ చివరి వరకు ఇదే జోరు కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మంజల్ పూర్ స్థానంలో 8 రౌండ్ల ఫలితాలు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ 23,632 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబారీ 10,123 ఓట్లు సాధించారు. ఇక దాటియా స్థానంలో 3 రౌండ్ల కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ 12,432 ఓట్లు, బీజేపీ అభ్యర్థి అశుతోశ్ తివారీ 12,399 ఓట్లు సాధించారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ కేవలం 33 ఓట్ల తేడా మాత్రమే ఉంటంతో ఈ ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి.

#by polls#bjp states#prashanth kishore lead#bakeempur segment#bihar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి