టాప్ న్యూస్

Rice : అన్నంతో క్యాన్సర్.. ఎక్కువ తిన్నారంటే ఖతమే?

రచన: Kumar5 నిమిషాల పఠనం

దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా అన్నం(రైస్) తింటుంటారు. ఉత్తర భారతంలో మాత్రం చపాతీలు ఎక్కువగా ఆహారంలా తీసుకుంటుంటారు. అయితే, అన్నం ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తాజాగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.

దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా అన్నం(రైస్) తింటుంటారు. ఉత్తర భారతంలో మాత్రం చపాతీలు ఎక్కువగా ఆహారంలా తీసుకుంటుంటారు. అయితే, అన్నం ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తాజాగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.ఎందుకంటే బియ్యం పండించే సమయంలోనే ప్రమాదకర రసాయనాలు చేరుతున్నాయని.. ఎరువుల మందులు కూడా అందుకు ఓ కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐక్యరాజ్యసమితి ఆహార,వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్త నిపుణుల కమిటీ (జేసీఎఫ్‌ఏ) నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం.

మనం నిత్యం తీసుకునే ఆహారం, తాగునీటి ద్వారా అత్యంత ప్రమాదకరమైన ‘ఆర్సెనిక్’ (విషపూరిత రసాయన మూలకం) మనిషి శరీరంలోకి వెళుతోందని, తద్వారా అది ఆరోగ్యంపై మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపునుందని ఆ సర్వే పేర్కొంది. భారత్ సహా వరల్డ్ వైడ్‌గా వివిధ దేశాల్లో ప్రజలు తీసుకునే ఆహార పదార్థాలపై నిర్వహించిన లోతైన అధ్యయనం వివరాలను ‘డబ్ల్యూహెచ్‌వో ఫుడ్ యాడిటివ్స్ సిరీస్-92’లో పొందుపరిచారు. ఈ నివేదిక రానున్న భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే దానిపై స్డడీ చేసినట్టు తెలిసింది.

బెంగాల్ రాజధాని కోల్‌కతా పరిధిలోని పట్టణ,గ్రామీణ ప్రజల ఆహార అలవాట్లు, స్థానిక మార్కెట్లలో లభించే బియ్యం, కూరగాయలు, ఆకుకూరలపై అధ్యయనం చేసి ఈ అంచనాలను రూపొందించినట్టు తెలిసింది. మన దేశంలో పెద్దలు నిత్యం తమ శరీర బరువులో ప్రతి కిలోగ్రామునకు సగటున 1.06 మైక్రోగ్రాములు, అలాగే 10 ఏళ్ల పిల్లలు రోజుకు 1.27 మైక్రోగ్రాముల చొప్పున అజైవిక/కలిషిత ‘ఆర్సెనిక్‌’ తీసుకుంటున్నట్టు సమాచారం. పెద్దలతో పోలిస్తే 10 ఏళ్ల లోపు పిల్లల శరీరంలోకే ‘ఆర్సెనిక్’ అధిక మోతాదులో చేరుతోందని నివేదిక సారాంశం.

ఫలితంగా చిన్నతనంలోనే శరీర ఎదుగుదల, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో ‘ఆర్సెనిక్’‌లో ఎక్కువభాగం దాదాపు 81% నుంచి 83% వరకు ఒక్క బియ్యం, ఇతర ధాన్యాల ద్వారానే శరీరంలోకి వెళ్తున్నట్టు తేలింది.ఆ తర్వాతి స్థానంలో కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీటిని అందించినప్పటికీ, పంట పొలాల్లో ఉపయోగించే నీరు, మట్టిలో ఉండే ఆర్సెనిక్ వల్ల బియ్యం, కూరగాయల్లోకి ఈ విషపూరిత రసాయనం చేరుతున్నట్టు గుర్తించారు. ఆర్సెనిక్ శరీరంలో చేరడం వల్ల ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కాలేయం, కిడ్నీ క్యాన్సర్లకు కూడా ఇది కారణమవుతోందని నివేదికలు వెల్లడించాయి.

#Rice#cancer disease#arseninc#chemical#food habbits#india
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి