National

WFI : భారత మహిళ రెజ్లర్లకు షాక్..బ్రిజ్‌భూషణ్‌ కేసులో కీలక తీర్పు

రచన: Kumar3 నిమిషాల పఠనం

భారత మహిళా రెజ్లర్లకు బిగ్‌షాక్ తలిగింది. భారత కుస్తీ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది.

భారత మహిళా రెజ్లర్లకు బిగ్‌షాక్ తలిగింది. భారత కుస్తీ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. దేశీయ క్రీడారంగంలో సంచలనం సృష్టించిన వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమార్‌ను సైతం న్యాయస్థానం వేధింపుల కేసు నుంచి విముక్తి కల్పించింది.

ఇదిలాఉండగా, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్.. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా వంటి దిగ్గజ అథ్లెట్ల నాయకత్వంలో 2023లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టిన విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్.. ఇన్ కెమెరా ముందు తలుపులు మూసివేసి తుది విచారణ పూర్తి చేశారు. ప్రాసెక్స్యూషన్, డిఫెన్స్ ఇరువర్గాల వాదనలు, ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం బ్రిజ్ భూషణ్ మీద వచ్చిన ఆరోపణల్లో సరైన ఆధారాలు లేనందున, నేరం రుజువు కాలేదని పేర్కొంటూ బ్రిజ్‌ భూషణ్, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమార్‌ను సైతం నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పువెలువరించింది.

#WFI former president brizbhusan#sexual harrasment case#delhi rause avenue court#cleanchit
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి