హైదరాబాద్ మహానగరంలో పోకిరీలు,గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతి మించుతున్నాయి. రోజురోజుకూ వీరి మీద ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం,డబ్బులు గుంజటం వంటి పనులకు వీరు పాల్పడుతున్నట్టు సమాచారం.
ఎక్కువగా రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ బెడద ఎక్కువ అవుతోందని నగరవాసులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.తాజాగా నలుగురు పోకిరీలు ఓ క్యాబ్ డ్రైవర్ మీద తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. రక్తం వచ్చేలా తల మీద దాడి చేసినట్టు తెలిసింది.
నగరంలోని మాదాపూర్ పరిధి గుట్టల బేగంపేట్‌లోని క్యాపిటల్ పార్క్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మహమ్మద్ అహ్మద్ అనే క్యాబ్ డ్రైవర్‌ను నలుగురు పోకిరీలు దాడి చేస్తుండగా.. అజర్ ఖాన్ అనే మరో క్యాబ్ డ్రైవర్ వారిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ఆ దుండగులు సెల్‌ఫోన్ తీసుకొని నెత్తిపై బలంగా కొట్టడంతో.. అజర్ తల పగిలి తీవ్ర రక్తస్రావం అయ్యింది.
https://x.com/pulsenewsbreak/status/2084084585412100447?s=20
ఇది గమనించిన స్థానికులు చుట్టుముట్టి ఆ నలుగురు ఆకతాయిల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.దాడి చేసిన యువకులు రాకేష్, వరుణ్, సాయి తేజ, శివ మహేశ్వర్‌గా గుర్తించారు. స్థానికులు, బాధిత వ్యక్తుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












