Ram Charan: మల్టీప్లెక్స్ రంగంలోకి మెగా పవర్ స్టార్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సుకుమార్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.
ఇటీవలే, పెద్ది సినిమాతో వచ్చిన చరణ్, తన పర్ఫార్మెన్స్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనుకున్న ఈ మూవీ..ప్రతీ ఒక్కరికీ గట్టి షాకిచ్చింది. మేకర్స్ చెప్పిన లెక్కలెలా ఉన్నా..బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫ్లాప్ సినిమా కిందే జమ కట్టారు. ఒకరకంగా చరణ్ కి ఇది ఊహించని రిజల్ట్ అని చెప్పాలి.
దీని నుంచి బయటపడటానికి వెంటనే ఆర్సీ 17ని పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ, పెద్ది షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల చేతి మణికట్టుకి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీనితో నెలన్నర నుంచి రెండు నెలలపాటు రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. ఇక, సుకుమార్ తో చేయబోయే సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ రికార్స్ కొత్తగా క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇది ఇలా ఉంటే..రామ్ చరణ్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే, చరణ్ కి కొన్ని బిజినెస్‌లున్నాయి. వాటితో పాటు థియేటర్స్ రంగంలోకి రావాలనుకుంటున్నాడట. ఇప్పటికే, ఏఎంబీతో సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రిపుల్ ఎ తో అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఈ వ్యారంలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈలిస్ట్ లో రామ్ చరణ్ కూడా చేరబోతున్నాడని ప్రస్తుతం న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రామ్ చరణ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.












