Srikanth Odela: కొన్ని సినిమాలపై రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కొద్ది మేకర్స్.. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచడానికి రక రకాల పదాలను ఉపయోగిస్తుంటారు. అలా, మాట్లాడక పోతే సినిమాకి బజ్ క్రియేట్ అవదు..బిజినెస్ జరగదు..ఇలా రక రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. అందుకే, చిన్న అవకాశం దొరికినా, సినిమాపై..అందులో నటిస్తున్న హీరో గురించి విపరీతంగా హైప్ పెంచేస్తున్నారు.
అలా, తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన ఒకే ఒక్క మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నానితో ఇంతకముందు దసరా లాంటి కల్ట్ క్లాసిక్ తీసి పలువురు ప్రశంసలు అందుకున్నాడు. కీర్తి సురేష్ ని కూడా అంతకముందు ఏ దర్శకుడు అలా చూపించలేదు. వీరి ముగ్గురు కెరీర్ లో దసరా సినిమా ఓ మ్యాజిక్ అని చెప్పాలి. ఇప్పుడు, మరోసారి నానితో ఈ దర్శకుడు 'ది ప్యారడైజ్' అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిసున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చింది.
ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెల మొదటిరోజే నాని లుక్ వదిలి సర్‌ప్రైజ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన 35 సెకన్ల నిడివితో ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ ని వదలబోతున్నగా కన్‌ఫర్మ్ చేశారు. అయితే, ఓ పబ్లిక్ ఫంక్షన్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యాంకర్ స్రవంతి చోకరపు..ఆగస్టు 6న టీజర్ రిలీజ్ కాబోతోంది. మరి, ఆ టీజర్ ఎలా ఉంటుంది..ఆగస్టు 6న ఏం జరగబోతుంది..మా కోసం ఏదైనా చెప్పండి..అని అడిగింది..దీనికి, సమాధానంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల "తగలబడుతుంది".. అని సింపుల్‌గా నవ్వేస్తాడు..దీంతో, ది ప్యారడైజ్ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉందో ఊహించుకుంటున్నారు. కొందరేమో జస్ట్ టీజర్ కే తగలబడితే ట్రైలర్..సినిమా రిలీజ్ రోజు ఇంకేం జరుగుతుంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో నాని "జడల్" అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అందాలతో ఆకట్టుకోనుంది.












