Prabhas-Fauzi: మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ఫౌజీ. ఇటీవల వచ్చిన ప్రభాస్ లుక్ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ యలమంచిలి ఈ సినిమాకి సంబందించిన కీలకమైన అప్‌డేట్ ను ఇచ్చాడు.
గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఒక వైపు స్పిరిట్, మరో వైపు ఫౌజీ సినిమాలను సమాంతరంగా చేస్తూ వస్తున్నాడు. వాస్తవానికి, ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ, మధ్యలో ప్రభాస్ సర్జరీ చేయించుకోవడం వల్ల కొంత విరామం..ది రాజాసాబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కొంత గ్యాప్..ఇలా పలు కారణాల వల్ల ఆలస్యం అయింది.

దీంతో, ఇండస్ట్రీలోనూ..ప్రభాస్ అభిమానుల్లోనూ ఫౌజీ నుంచి అప్‌డేట్స్ రావడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. దాంతో నిర్మాతలు మొన్నామధ్య ప్రభాస్ లుక్ రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మరోసారి కన్‌ఫర్మ్ చేయడమే కాకుండా, ప్రీమియర్స్ ఏ డేట్ లో పడబోతున్నాయో కూడా రివీల్ చేశాడు రవి శంకర్. ఈ ఏడాది డిసెంబర్ లో 3వ తేదీన ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీన ఇండియా తో పాటు ఇతర దేశాలలోనూ ప్రీమియర్స్ పడబోతున్నాయి. తాజాగా, ఈ విషయాన్ని నిర్మాత వెల్లడించడం విశేషం. దీంతో, డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపైంది. హను రాఘవపూడి ఓ పీరియాడికల్ సినిమాగా ఫౌజీని తెరకెక్కితుండగా, ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.












