క్రైమ్

Crime : మరో కీచక ఎస్ఐ.. పెళ్లిపేరిట మహిళపై అఘాయిత్యం..

రచన: Kumar3 నిమిషాల పఠనం

ప్రజలను కాపాడి, చట్టాన్ని రక్షించాల్సిన వారే నేరాలకు పాల్పడున్నారు.చట్టం గురించి తెలియని వారు నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారంటే వేరు.. కానీ, బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగాల్లో ఉండి కొందరు మహిళలకు మాయమాటు చెప్పి వారిని మోసం చేస్తున్నారు.

ప్రజలను కాపాడి, చట్టాన్ని రక్షించాల్సిన వారే నేరాలకు పాల్పడున్నారు.చట్టం గురించి తెలియని వారు నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారంటే వేరు.. కానీ, బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగాల్లో ఉండి కొందరు మహిళలకు మాయమాటు చెప్పి వారిని మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలు, అమ్మాయిలను లైంగికంగా వాడుకుని వదిలేయడం వంటి ఘటనలు ప్రతి రోజూ ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని ఓ మహిళకు దగ్గరైన ఎస్ఐ.. ఆమెపై లైంగిక దాడి పాల్పడటంతో పాటు చంపాలని కూడా చూసినట్టు తెలిసింది. ఈ ఘటన యూపీ రాష్ట్రం లక్నోలోని ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఓ మహిళకు సంబంధించిన కేసు విచారణ బాధ్యతను ఎస్ఐ ధర్మవీర్ షాహికి ఉన్నతాధికారులు అప్పగించారు.ఈ కేసులో పురోగతి లేదని చెప్పి.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎస్ఐ ధర్మవీర్ సదరు బాధిత మహిళ వెంటపడినట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2084094651825520803?s=20

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను సదరు ఎస్ఐ లోబరుచుకున్నట్టు తెలిసింది. అయితే, కొన్ని రోజులు గడిచాక ఎస్ఐకి అప్పటికే పెళ్లైన విషయం తెలియడంతో బాధిత మహిళ నిలదీసింది. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రోడ్డు ప్రమాదం సృష్టించి, ఆమెను హతమార్చేందుకు కూడా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకుని బాధితురాలు ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఎస్ఐ ధర్మవీర్ షాహిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

#SI#police#cheating#women#sexual affair#utterpradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి