National

Jharkhand: కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్.. సీఎం సీటుకు ఎసరు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

జార్ఖండ్ పరీక్షల అవకతవకల అంశంలోనూ విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే విద్యార్థుల ఉద్యమానికి సీజేపీ బహిరంగ మద్దతు ప్రకటించడంతో ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది..

నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ అంశంపై చేసిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు మరో కీలక పోరాటానికి సిద్ధమైంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై పోరాటానికి సీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. జార్ఖండ్‌లో నిరసనలు చేపడుతున్న విద్యార్థులతో మాట్లాడినట్లు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విద్యార్థికి కాక్రోచ్ జనతా పార్టీ అండగా ఉంటుందని.. వారి న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల నిర్వహించిన జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వేలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా రాష్ట్ర రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో జేపీఎస్సీ చైర్మన్ లాల్బియాక్ట్లుంగా కియాంగ్టే ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు.

అయితే, పరీక్షల్లో అవకతవకలకు సీఎం హేమంత్ సోరెన్‌ బాధ్యుడని.. ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించి సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

మాజీ డిప్యూటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఓ ప్రైవేట్ ఏజెన్సీ మార్కెటింగ్ మేనేజర్ సహా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి సీజేపీ మద్దతు ప్రకటించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన సీజేపీ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగించింది.

అదే తరహాలో జార్ఖండ్ పరీక్షల అవకతవకల అంశంలోనూ విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే విద్యార్థుల ఉద్యమానికి సీజేపీ బహిరంగ మద్దతు ప్రకటించడంతో ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది..

#Jharkhand#Cockroach Party#CM Hemant Soren#JPSC#JSSC
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి