National

Karnataka : సీఎం డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణ.. 20 మందికి అవకాశం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కొత్తగా 20 మంది నూతన మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంలోకి చేరే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయగా.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కొత్తగా 20 మంది నూతన మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంలోకి చేరే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయగా.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.ఈ క్రమంలోనే నేటి సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం డీకే శివకుమార్ లోక్‌భవన్‍ను కోరినట్టు తెలిసింది.

కర్ణాటక కేబినెట్ విస్తరణ జులై 31వ తేదీన జరగాల్సి ఉంది. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ పెద్దల చర్చల కారణంగా షెడ్యూల్ వాయిదా పడింది.అయితే, తన మంత్రివర్గంలో యువత, మైనారిటీలకు సీఎం డీకే శివకుమార్ ప్రాధాన్యత కల్పించారు.

గత జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ టైంలో సీఎంతో పాటు 13 మంది మాత్రమే మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ కొనసాగుతూనే ఉంది.తాజాగా కొత్తగా కేబినెట్ విస్తరణ జరగడం, సాయంత్రం మంత్రుల ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది.

అయితే, ఈ మంత్రివర్గ విస్తరణలో మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గానికి కూడా సమప్రాధాన్యతను డీకే శివకుమార్ కల్పించారని సమాచారం.సాయంత్రం మంత్రులుగా ప్రమాణం చేసేవారి జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిలో ఎవరెవరు ఉన్నారంటే.. పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాణి, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ వైద్య, అజయ్ సింగ్, ఎన్. చెలువారాయ స్వామిృ, కె.ఎమ్. శివలింగేగౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతేగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, లక్ష్మణ్ సవది ఉన్నారు.

#Cm dk shivakumar#cabinet extension#karnataka#20 ministers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి