Sai Pallavi: గత కొంతకాలంగా సాయి పల్లవి కెరీర్‌ను పరిశీలిస్తే “కెరీర్ స్లో అయిపోయింది” అనే మాట టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు సినిమాను సైన్ చేయకపోవడమే. అయితే, అది పూర్తిగా వాసతవం కాదు. ప్రస్తుతం, సాయి పల్లవి సినిమాల సంఖ్య తగ్గింది, కానీ అందుకు ప్రధాన కారణం వరుస ఫ్లాపులు కంటే ఆమె ఎంచుకుంటున్న కథలు, పాత్రల స్వభావం, ప్రాజెక్టుల స్కేల్, షూటింగ్‌కు పడుతున్న సమయం అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఆమె కెరీర్ ఒక కొత్త దశలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అది, బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న రామాయణ సిరీస్. అలాగే, మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఎంచుకుంది. కానీ, ఒకప్పుడు సాయి పల్లవి వరుసగా సినిమాలు చేసేది. 2017-2021 మధ్య ఫిదా, ఎంసిఎ, పడి పడి లేచే మనసు, మారి 2, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి సినిమాలతో బిజీగా కనిపించింది. కానీ, ఆ తర్వాత ఆమె సినిమాల ఎంపిక చాలా సెలెక్టివ్‌గా మారింది. దీనికి, కారణం ఫ్లాప్స్ అని కూడా చెప్పొచ్చు.
సాయి పల్లవి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునేందుకు వచ్చే ప్రతి ఆఫర్‌ను అంగీకరించే నటి కాదు. ఇలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉండటం, పాత్రకు ఒక బలమైన ఎమోషనల్ గ్రాఫ్ ఉండటం వంటి అంశాలను ఆమె ప్రాధాన్యంగా చూస్తుంది. దీనివల్ల, సహజంగానే ఆమెకు వచ్చే సినిమాల సంఖ్య తగ్గుతుంది. కానీ, తక్కువ సినిమాలు చేయడం అంటే కెరీర్ పడిపోవడం అని డిసైడ్ చేయలేము.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తే..పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు..అదే సమయంలో మైథలాజికల్ మూవీస్ కాబట్టి ఈ మధ్య కాలంలో సాయి పల్లవి చేస్తున్న సినిమాలకి ఎక్కువ సమయం పడుతోందొ. సాయి పల్లవి రామాయణంలో సీత పాత్రను చేస్తోంది. ఈ సినిమా 2026 నవంబర్ 6న విడుదలకు షెడ్యూల్ అయి ఉంది. దీనికి సీక్వెల్ కూడా 2027లో రావాల్సి ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో షూటింగ్, ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ ఇలా అన్నిటికీ ఎక్కువ సమయం తీసుకుంటారు. అందువల్ల, హీరోయిన్‌గా ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం, సాయి పల్లవి ఫిల్మోగ్రఫీని చూస్తే రామాయణం, రామాయణం పార్ట్ 2, ఇంజి వెల్లం, ఓం ఛాప్టర్ 1: వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా, మణిరత్నం దర్శకత్వంలోని ఇంజి వెల్లంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. ఈ లిస్ట్ చూస్తే, సినిమాల సంఖ్య మాత్రమే తగ్గింది. కానీ, కథా బలమున్న భారీ చిత్రాలతో చాలా బిజీగా ఉందని అర్థమవుతోంది.


