తెలంగాణ

TG: వీసా ముగిసినా దర్జాగా నేరాలు.. హైదరాబాద్‌లో విదేశీయుల ముఠా గుట్టురట్టు!

రచన: Mahesh•••3 నిమిషాల పఠనం

TG: వీసా గడువు ముగిసిపోయినా నగరంలో తిష్ఠవేసి అక్రమ దందాలు, నేరాలకు పాల్పడుతున్న విదేశీయులపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. తాజాగా స్పెషల్ బ్రాంచ్ (ఫారెనర్స్ మానిటరింగ్ సెల్),

TG: వీసా గడువు ముగిసిపోయినా నగరంలో తిష్ఠవేసి అక్రమ దందాలు, నేరాలకు పాల్పడుతున్న విదేశీయులపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. తాజాగా స్పెషల్ బ్రాంచ్ (ఫారెనర్స్ మానిటరింగ్ సెల్), ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, శాంతిభద్రతల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో నగరవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న 49 మంది విదేశీయులను గుర్తించారు. వీరిలో ఇప్పటికే 12 మందిని స్వదేశాలకు డిపోర్ట్ చేయగా, మిగతా వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధికంగా ఒక్క టోలిచౌకి ప్రాంతంలోనే 30 మంది పట్టుబడటం కలకలం రేపింది.

అధికారుల వివరాల ప్రకారం.. ఈ తనిఖీల్లో ఫారనర్స్‌ చీకటి కోణాలు విస్తుపోయేలా వెలుగుచూశాయి. స్టూడెంట్ వీసాపై వచ్చిన కొందరు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ ఆసుపత్రుల్లో బ్రోకర్లుగా అవతారమెత్తారు. విదేశీ రోగులకు ట్రాన్స్‌లేటర్లుగా వ్యవహరిస్తూ ఫీజులు గుంజడంతో పాటు, ఆసుపత్రి బిల్లుల్లో ఏకంగా 15 శాతం కమిషన్లు దండుకుంటున్నారు.

మరికొందరు నకిలీ నోట్ల చెలామణి, గంజాయి యూజ్, దగ్గు మందులో మత్తు మందులు కలిపి వాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టూరిస్ట్ వీసాపై వచ్చి గడువు ముగిసిన కెన్యా మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడగా, టెస్టుల్లో పలువురు విదేశీయులు గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు.

అక్రమ నివాసాలు, నేరాలకు పాల్పడితే ఎంతమాత్రం ఉపేక్షించబోమని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. విదేశీయులకు ఇళ్లు, గదులు అద్దెకిచ్చే ఓనర్స్ తప్పనిసరిగా పాస్‌పోర్ట్, వీసాలు పరిశీలించి ‘ఫారమ్ 3/సి’ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రూల్స్ బ్రేక్ చేస్తే యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

#TG News#Telangana News#Hyderabad Police#Foreigners in Hyderabad#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి