సినిమా

Aishwarya Lekshmi: రాకా మూవీలో ఐశ్వర్య లక్ష్మి..ఇదే అసలు ట్విస్ట్!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Aishwarya Lekshmi: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాకా. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో నిజం లేదని స్వయంగా ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది.

Aishwarya Lekshmi: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాకా. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో నిజం లేదని స్వయంగా ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది.

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా, ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా ‘రాకా’లో నటిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలకు ఆమె స్వయంగా చెక్ పెట్టారు.

‘రాకా’లో నేను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఐశ్వర్య లక్ష్మి ఖండించారు. నేను ఈ సినిమాలో భాగం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, తనదైన స్టైల్లో సరదాగా స్పందిస్తూ “No, I am not part of the film. Somebody please cast me in the film” అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఇప్పటివరకు తనను ‘రాకా’లో భాగం చేశారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లియర్‌గా చెప్పేశారు.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె పేరు అధికారికంగా ఉంది. సినిమాలో ఇతర కీలక పాత్రలకు సంబంధించిన పలు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, మేకర్స్ పూర్తి కాస్టింగ్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘రాకా’పై నేషనల్ లెవల్లో ఆసక్తి నెలకొంది.

#Allu Arjun#Raaka#Atlee Kumar#Aishwarya Lekshmi#Deepika Padukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి