సినిమా

Kalyani Priyadarshan: ప్రళయ్ మూవీ కోసం ముంబైకి మకాం మార్చిన కళ్యాణి!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Kalyani Priyadarshan: మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ప్రళయ్’.

Kalyani Priyadarshan: మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ప్రళయ్’. ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కథ, మేకింగ్, భారీ స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా కోసం కళ్యాణి ప్రియదర్శన్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

'లోకా'తో వచ్చిన క్రేజే కారణం:

సౌత్‌లో బిజీగా ఉన్న కళ్యాణికి ఇలా బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందీ అంటే దానికి ఖచ్చుతంగా లోకా మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా కళ్యాణికి వచ్చిన క్రేజే కారణం. ఇంతకాలం నుంచి ఈ స్థాయి సక్సెస్ కళ్యాణికి దక్కలేదు. లోకా ఛాప్టర్ 1తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కింది. దాంతో, బాలీవుడ్ సినిమా ఛాన్స్ అందుకుంది.

'ప్రళయ్' కోసం ముంబైలో మకాం?

‘ప్రళయ్’ షూటింగ్, సినిమా కోసం అవసరమైన ప్రిపరేషన్‌లో భాగంగా కళ్యాణి ప్రియదర్శన్ ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం ముంబైకి మకాం మార్చినట్టుగా కూడా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇకపై సౌత్‌లో సినిమాలు చేయదనే మాట కూడా వినిపిస్తోంది.

అయితే, ఇది కేవలం షూటింగ్ షెడ్యూల్ కోసమేనా? లేక పాత్ర కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సినిమాలో కళ్యాణి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం అదనపు సమయం కేటాయిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎక్కువ సమయం వర్కౌట్స్ కోసం కేటాయించి బాగా సన్నబడుతుందట. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతోనే ఇంత కఠినంగా తనని తాను మలుచుకుంటుంది. అయితే, ముంబైలో మాత్రం ఆమె పూర్తిగా ఉండటానికి తీసుకున్న నిర్ణయం మాత్రం కాదంటున్నారు. ప్రళయ్ మూవీ ఫలితాన్ని బట్టి తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయి.

#Kalyani Priyadarshan#Pralay#Bollywood#Ranveersingh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి