National

సీఎన్‌జీ నింపుతుండగా భారీ పేలుడు.. ముక్కలైన కారు.. CNG వెహికల్ వాడే వారు పాటించాల్సిన జాగ్రత్తలు

రచన: NK••4 నిమిషాల పఠనం

CNG Car Explode: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారులో సీఎన్‌జీ నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. కారు ముక్కలు ముక్కలైంది. కర్జన్‌ టోల్ ప్లాజా సమీపంలో నేషనల్ హైవే 48పై ఈ ఘటన జరిగింది. అక్టోబర్‌ 1న ఈ ఘటన జరిగింది. జిందాల్‌ కంపెనీకి ఎదురుగా ఉన్న ఫ్యూయల్ స్టేషన్ లో కారులో సీఎన్ జీ నింపుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో కారు వెనుక భాగం ముక్కలుముక్కలైంది.

ప్రాణభయంతో పరుగులు

కాగా, ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం.. బంకు సిబ్బంది కూడా కొంత దూరంలో ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సీఎన్‌జీతో నడిచే కారు భారీ శబ్దంతో పేలడంతో బంకు సిబ్బంది, చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బంకు సిబ్బంది, ఇతర వాహనదారులు ప్రాణభయంతో అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటనలో కారుకు సమీపంలోనే ఉన్న మరో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

గ్యాంస్ ట్యాంక్ పేలిపోవడానికి కారణం ఏంటి

ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. గ్యాస్ ట్యాంక్ ఎందుకు పేలింది అనేదానిపై దర్యాఫ్తు జరుగుతోంది. సీఎన్‌జీ కిట్‌లో లీకేజీ లేదా సిలిండర్‌ వాల్వ్‌లో లోపం పేలుడుకు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. సీఎన్‌జీ నింపే సమయంలో భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన ఆందోళనలను రేకెత్తించింది. మరోవైపు సీఎన్‌జీ నింపే సమయంలో వాహనం నుంచి బయటకు రావడం చాలా సేఫ్.

CNG వెహికల్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో జరిగిన ఘటన సీఎన్ జీతో నడిచే వెహికల్స్ వాడే వారిని ఆందోళనకు గురి చేస్తోంది. సీఎన్ జీ ఇంధనంతో నడిచే వాహనాలు కలిగున్న వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. CNG సిలిండర్లలో తీవ్రమైన ఒత్తిడితో గ్యాస్ ఫిల్ చేస్తారు కాబట్టి ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే సిలిండర్లకు ప్రతి మూడేళ్లకు ఓసారి హైడ్రాలిక్ టెస్ట్ చేయించాలని సూచించారు. ఇక, ఇంధనం నింపేటప్పుడు కచ్చితంగా ఇంజిన్ ఆఫ్ చేయాలని, ప్రయాణికులను కిందకు దించాలని జాగ్రత్త చెప్పారు. దీనివల్ల పేలినా ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుందన్నారు. సర్టిఫైడ్ కాని కిట్లు, వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల BIS సర్టిఫైడ్ కిట్సే వాడాలని నిపుణులు సూచించారు.

#CNG Car Blast#CNG Car Explode#Gujarat#Gas Tank#Karjan#Cylinder#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి