Tollywood: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ జంటగా నటించిన మాస్ అండ్ యాక్షన్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. 2024, సెప్టెంబర్ 27న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజై నందమూరి అభిమానులనే కాకుండా సినీ లవర్స్‌తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాలో ఉన్న సూపర్ హిట్ సాంగ్ "చుట్టమల్లె " డీప్ ఫేక్ ఏఐ వీడియో తో చాలా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు.
'AI'వల్ల బాధపడుతున్న పలువురు టాలీవుడ్ స్టార్స్:
ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మేలు ఎంత జరుగుతుందో అంతకన్న రెట్టింపు స్థాయిలో సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు ఎన్నో సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి, అంతటా సర్క్యులేట్ అవుతూ సినీ తారలను చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి.
ఇప్పటికే, సమంత..శ్రుతి హాసన్, చిరంజీవి, నాగార్జున లాంటి ఎంతోమంది కోర్టులను ఆశ్రయించారు. కేవలం, సినీ తారల ఫొటోలనే కాకుండా సినిమాలలోని పాటలను డీప్ ఫేక్ వీడియో చేసి నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వయంగా స్పందించాడు. ఆయన ఎక్స్ ఖతా ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు. ఏఐ ని వాడటం మంచికి తప్ప ఇలాంటి తప్పుడు వ్యవహారాల కోసం కాదని..ఆయన సీరియస్ నోట్ రాశారు.

ఆడవారి గురించి ఇలాంటి తప్పుడు వీడియోలను ఏఐ ద్వారా క్రియేట్ చేసి వారి పరువును పోగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేలా తారక్ నోట్ లో రాసుకొచ్చారు. ఇది, సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం, తారక్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


