క్రైమ్

Ananthagiri: బస్సు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి.. సీఎం దిగ్భ్రాంతి !

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపుతప్పి లోయవైపు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన గ్రామస్థులంతా కలిసి వికారాబాద్ జిల్లా ధరూర్‌ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న తమ బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బస్సులో బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే వికారాబాద్ పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Ananthagiri: బస్సు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి.. సీఎం దిగ్భ్రాంతి !

 ప్రమాద వార్త తెలిసిన వెంటనే వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ ఘటనాస్థలాన్ని, ఆసుపత్రిని స్వయంగా పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని ఆదేశించారు.

 ఈ ప్రమాదం పట్ల గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించాలన్నారు. అదేవిధంగా , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈ ఘటన విషయాన్ని తెలుసుకుని స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులకు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

#AnanthagiriBusAccident#VikarabadAccident#RevanthReddy#VikarabadGhatRoad#PrivateBusOverturned#TelanganaNews#AnanthagiriHills
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి