స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

సైబరాబాద్‌లో ఏజెంట్లకే రూ.2.5కోట్లు ఖర్చు అయ్యాయా?

రచన: Swechaanews Chairman••7 నిమిషాల పఠనం

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సంచలన వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 2 నెలల వ్యవధిలోనే రూ.2.5 కోట్లు బదిలీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. అదికూడా ఒకే కంపెనీకి, ఒకేరోజు దాదాపు రూ.90 లక్షల వరకు బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 2 నెలల్లోనే రూ.2.5 కోట్లను 2 కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేయడంపై పోలీస్ వర్గాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి.

  • ప్రజల అత్యవసరాల కోసం వాడాల్సిన సొమ్ము దుర్వినియోగం?

  • దీనికి సీపీ బాధ్యతనా?.. అడ్మిన్ డీసీపీ బాధ్యతనా?

  • డీజీపీకి తెలిసే జరిగిందా అంటూ విమర్శలు

  • పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న యూజర్ ఛార్జీల వ్యవహారం

  • రెండు ఏజెన్సీలకే నగదు ఇవ్వడంపై అనుమానాలు

  • అవినాష్ మహంతి ఉన్నప్పుడు కేవలం 16 లక్షలు మాత్రమే ఖర్చు

  • కానీ, ఇప్పుడు ఒక్కరోజే రూ.90 లక్షల దాకా చెల్లింపులు

  • సీపీ ఆధ్వర్యంలో జరిగే ఖర్చు.. ఏడాది కూడా కాకముందే భారీగా నగదు విత్ డ్రా

  • ఒకేసారి ఇంత మొత్తంలో ఖర్చు చేయడంపై అనేక ఆరోపణలు

  • టీ, కాఫీలు, స్పోర్ట్స్ ఈవెంట్లకు పెద్ద మొత్తంలో చెల్లింపులు

  • సిబ్బంది పాత్ర.. అక్రమాలు జరిగినట్లు అనుమానాలు

  • యూజర్ ఛార్జెస్ సొమ్ము ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది?

  • దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ ఛైర్మన్.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సంచలన వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 2 నెలల వ్యవధిలోనే రూ.2.5 కోట్లు బదిలీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. అదికూడా ఒకే కంపెనీకి, ఒకేరోజు దాదాపు రూ.90 లక్షల వరకు బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 2 నెలల్లోనే రూ.2.5 కోట్లను 2 కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేయడంపై పోలీస్ వర్గాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజానిజాలు బయటకు రావాలని పలువురు అడుగుతున్నారు. ఇంత మొత్తంలో డబ్బు బయటకు వెళ్లిందంటే సీపీకి తెలిసే ఇది జరిగిందా? డీజీపీకి తెలియకుండా జరిగిందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

యూజర్ ఛార్జీల అకౌంట్‌ నుంచి విడుదల

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన యూజర్ ఛార్జీల అకౌంట్‌కు ట్రాఫిక్ చలాన్లతో పాటు ఇతర అనుమతులు, వ్యవహారాలకు సంబంధించిన ఛార్జీల నగదు డిపాజిట్ అవుతుంటాయి. ఇదంతా ప్రజల నుంచి పలు రూపాల్లో వసూలయ్యే సొమ్ము. ఇందులో జమ అయ్యే డబ్బును పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు అందించే సేవల అభివృద్ధికి కోసం మాత్రమే ఉపయోగించాలి. ప్రతీ చెల్లింపునకు లెక్క ఉండాలి. ఖర్చు చేసే ప్రతి పైసాకు రికార్డ్ అయి ఉండాలి. కానీ, అలా జరగలేదు. రూ.5 లక్షలు మించిన పనులు ఉంటే వాటికి కచ్చితంగా టెండర్లు పిలవాలనే రూల్ ఉంది. కానీ, ఈ ఏడాది జూలై, ఆగస్ట్ నెలలో ఈ యూజర్ ఖాతా నుంచి మహాకాల్, కేబీ ఎంటర్ ప్రైజస్ సంస్థలకు దాదాపు రూ.2.5 కోట్లకు పైగా నగదు బదిలీ అయ్యాయి. జూలై నెలలో ఒకేరోజు రూ.90 లక్షల వరకు మహాకాల్ ఎంటర్ ప్రైజస్ సంస్థకు వెళ్లాయి.

గతంలో చిన్న మొత్తంలో ఖర్చు

ఈ యూజర్ ఛార్జీల ఖాతా నుంచి గతంలో ఇంత భారీ ఎత్తున నగదు ఎప్పుడూ బదిలీ కాలేదు. అవినాష్ మహంతి ఉన్నప్పుడు కేవలం 16 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో నగదు బదిలీ కావడంతో అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి. ఇన్ని కోట్లాది రూపాయాల నగదును రెండు కంపెనీలకే, అదికూడా రెండే నెలల్లో ఎందుకు బదిలీ చేశారు? వాళ్లు చేసిన పని ఏంటి? టెండర్లు ఏమైనా పిలిచారా? అసలు ఆ కంపెనీల చరిత్ర ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నగదు మళ్లిపుపై పబ్లిక్ ఆడిట్ జరిగితే అసలు బాగోతం వెలుగులోకి వస్తుందని పోలీస్ వర్గాల నుంచే డిమాండ్ వినిపిస్తోంది.

డీజీపీకి తెలిసే జరిగిందా?

ఈ అనుమానాస్పద అంశం సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీకి తెలిసే జరిగిందా? తెలియకుండా చేశారా అనే విషయాలు బయటకు రావాల్సి ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం బదిలీపై డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని విచారణలో ప్రజా దుర్వినియోగం జరిగిందని రుజువైతే సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రజల అత్యవసరాల కోసం వాడాల్సిన సొమ్ము దుర్వినియోగం జరిగితే, దీనికి సీపీ బాధ్యతనా? అడ్మిన్ డీసీపీ బాధ్యతనా? లేక డీజీపీకి తెలిసే జరిగిందా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. టీ, కాఫీలు, స్పోర్ట్స్ ఈవెంట్ల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినట్టు సమాచారం. ఇందులో సిబ్బంది పాత్ర, భారీగా అక్రమాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయినా యూజర్ ఛార్జెస్ సొమ్ము ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది? దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? అనేది చూద్దాం.

#CyberabadPolice#UserChargesScam#TransferredFunds#HyderabadPolice#PublicAuditDemand#SwechaaNews#TelanganaPolice
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి