క్రీడలు

ఆసియా క్రీడలు.. గోల్ఫ్, ఆర్చరీలలో రెండు స్వర్ణ పతకాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో ఇవాళ (శనివారం) రెండు ప్రతిష్టాత్మక బంగారు పతకాలను గెలుచుకున్నారు. మహిళల గోల్ఫ్ విభాగంలో ప్రణవి ఉర్స్ చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మొహోద్ పసిడి పతకంతో మెరిశారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ నెలకొన్న ఈ పోటీల్లో భారత మహిళా అథ్లెట్లు ప్రతిభ చాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు.

 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో ఇవాళ (శనివారం) రెండు ప్రతిష్టాత్మక బంగారు పతకాలను గెలుచుకున్నారు. మహిళల గోల్ఫ్ విభాగంలో ప్రణవి ఉర్స్ చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మొహోద్ పసిడి పతకంతో మెరిశారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ నెలకొన్న ఈ పోటీల్లో భారత మహిళా అథ్లెట్లు ప్రతిభ చాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు. పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతోంది.

 మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే గోల్ఫ్ ఈవెంట్‌లో ప్రణవి ఉర్స్ 15-అండర్ పార్ స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రౌండ్‌లో చివరి హోల్ వరకు సంయమనం కోల్పోకుండా ఆడి ప్రణవి ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీనికి తోడు అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కలసి టీమ్ ఈవెంట్‌లో ప్రణవి రజత పతకాన్ని సాధించింది. చైనా జట్టు 22-అండర్ పార్ స్కోరుతో స్వర్ణం సాధించగా, భారత్ సిల్వర్ మెడల్‌తో సంతృప్తి చెందింది.

ఆసియా క్రీడలు.. గోల్ఫ్, ఆర్చరీలలో రెండు స్వర్ణ పతకాలు!

 మరోవైపు, ఆర్చరీలో భారత క్రీడాకారిణి కుంకుమ్ మొహోద్ మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో భారత్‌కు పసిడి అందించిన తొలి ఛాంపియన్‌గా ఆమె చరిత్ర పుటలకెక్కింది. ఈ అద్భుత విజయంతో కుంకుమ్ రాబోయే లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం విశేషం. తైక్వాండో మహిళల 57కేజీల విభాగంలో కషిష్ మాలిక్ 0-2 తేడాతో ఓటమి పాలయ్యారు.

 శనివారం సాధించిన ఈ విజయాలతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత్ ఇప్పటివరకు 17 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 77పతకాలను సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, క్రీడా ప్రముఖులు విజయాలు సాధించిన అథ్లెట్లకు అభినందనలు తెలుపుతున్నారు.

 

#AsianGames2026#PranaviUrs#GoldMedal#KumkumMohod#IndianArchery#GolfGold#LA2028Olympics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి