కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓం: చాప్టర్ 1’ రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఓం’ విడుదల కానుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
రజనీకాంత్ కోసం వాయిదా!
వాస్తవానికి ‘ఓం’ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, అక్టోబర్ 15న రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో క్లాష్ కాకుండా ఉండేన్దుకు ధనుష్ తన సినిమాను వాయిదా వేశారు. అంతేకాదు, అక్టోబర్ 16న టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రణబాలి కూడా రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. దీంతో, పెద్ద సినిమాలు ఒకదానికొకటి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధనుష్ గతంలో వెల్లడించారు.
అంతేకాదు, సూర్య కోసం మరోసారి దీపావళికి రిలీజ్ అనుకొని మరోసారి ‘ఓం’ వెనక్కి తగ్గింది. ఆ సమయంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమాకు రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించడంతో.. మరో భారీ సినిమాతో పోటీకి వెళ్లకూడదని మేకర్స్ నిర్ణయించారు. ఇక, ‘ఓం’ సినిమాకు ప్రధాన బలం జాతీయ అవార్డు గ్రహీతలైన ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్. ఈ ఇద్దరు స్టార్లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి భారీ స్థాయిలో పెరిగింది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
క్రేజీ హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల కూడా సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాజర్, నసీరుద్దీన్ షా తదితరులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఎర్రచందనం నేపథ్యంతో రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో స్పష్టమైంది. కాగా, ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


