తెలంగాణ

ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి- అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK••4 నిమిషాల పఠనం

విద్య, వైద్యం రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పురోగతిపై ఆరా తీశారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ తో పాటు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు.

Cm Revanth: విద్య, వైద్యం రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పురోగతిపై ఆరా తీశారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ తో పాటు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులతో చెప్పారు. శనివారం సీఎంవో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్.. విద్య, వైద్య రంగాలకు సంబంధించిన క్షేత్ర పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది నియామకాలు ముందే పూర్తవ్వాలి

ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యాక సిబ్బంది కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలన్నారు. ఆయా హాస్సిటల్స్ లో ఎంతమంది డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు అవసరం అవుతారో ఇప్పుడే గుర్తించి నియామక ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని రకాల వైద్య సేవలు అందించాలి

ఆసుపత్రి నిర్మాణాలు పూర్తయేసరికి అసవరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇక ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలును కూడా వేగవంతం చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన వెంటనే అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించేలా పరికరాలు, సిబ్బంది, మౌలిక వసతులను సిద్ధం చేయాలన్నారు.

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే

జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం అవకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రభుత్వ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. హాస్టల్స్ లో మౌలిక వసతులను పరిశీలించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధులు విస్తరించకుడా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక డిసెంబర్ లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్. సమ్మిట్ నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

#Cm Revanth#Review#Health#Education#Government Hospitals#Government Schools#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి