Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న కీర్తి.. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఆ సిరీస్ పేరే ‘అక్క’.
యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధికా ఆప్టే కీలక పాత్రలో నటిస్తోంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 1980ల నేపథ్యంలో సాగే కథగా రూపొందింది. దక్షిణ భారతదేశంలోని కల్పిత పట్టణం ‘పెర్నూరు’లో మహిళల ఆధిపత్యంలో నడిచే ఒక శక్తివంతమైన వ్యవస్థ చుట్టూ కథ తిరుగుతుంది.
ఇందులో కీర్తి సురేష్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనుంది. మహిళల చేతుల్లో ఉండే గ్యాంగ్ వ్యవస్థ, గోల్డ్ స్మగ్లింగ్, అధికారం, ప్రతీకారం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కీర్తి, రాధికా ఆప్టే మధ్య జరిగే పవర్ గేమ్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో ‘అక్క’పై అంచనాలు పెరిగాయి. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. చాలా కాలం పాటు పెద్దగా అప్‌డేట్స్ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ సిరీస్ డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.అక్టోబర్ 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘అక్క’ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజా సమాచారం. అయితే, ఈ తేదీని నెట్‌ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
కీర్తి సురేష్‌కు ఇది తొలి వెబ్ సిరీస్ కావడంతో ‘అక్క’ ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది. ఇప్పటికే సినిమాల్లో విభిన్న పాత్రలు ఎంచుకుంటున్న కీర్తి.. ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక, ఇటీవలే..ది ప్యారడైజ్ సినిమాలో ఏషనాగుల సాంగ్‌తో ఆకట్టుకుంది. అలాగే, డోరతీ సినిమాతో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.


