National

India - Pakistan Border: సరిహద్దులో పాక్ పౌరుల కాల్చివేత.. భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

India - Pakistan Border: పంజాబ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టిన ఘటన ఇండియా - పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. సరిహద్దు కంచె దాటి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్తానీయులను సైన్యం కాల్చిచంపడంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

India - Pakistan Border: పంజాబ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టిన ఘటన ఇండియా - పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. సరిహద్దు కంచె దాటి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్తానీయులను సైన్యం కాల్చిచంపడంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

శుక్రవారం ముగ్గురు పాకిస్తాన్ పౌరులు పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లా పరిధిలోని భారత్ - పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచెను దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ.. వారు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకొచ్చారు. ముప్పు పొంచి ఉందని గ్రహించిన జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ప్రాణభయంతో వెనక్కి పారిపోయారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై పాకిస్తాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. తమ దేశ పౌరులు నిరాయుధులని, భారత భద్రతా బలగాలు వారిని అక్రమంగా కాల్చి చంపాయంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ ఘటనపై సంజాయిషీ కోరుతూ ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయ తాత్కాలిక రాయబారి డాక్టర్ సత్యంజల్ పాండేను పాక్ విదేశాంగ శాఖ పిలిపించి సమన్లు అందజేసింది.

చొరబాటుదారుల కాల్చివేత ఘటనపై నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన లేఖను ఆయన చేతికి అందించింది. అయితే దేశ భద్రత దృష్ట్యా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, హెచ్చరికలు పట్టించుకోకుండా సరిహద్దు దాటడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని భారత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

#India Pakistan Border#India Pakistan Tensions#BSF#Border Security Force#Punjab Border#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి