సినిమా

Chiranjeevi: తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Chiranjeevi: చుట్టమల్లే సాంగ్ ఏఐ డీప్‌ఫేక్స్ పై మెగాస్టార్ ఆగ్రహం..అవును, తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ సుధీర్ఘమైన నోట్ ను రాశారు. అందులో పలు అంశాలను వివరిస్తూ ఏఐ డీప్‌ఫేక్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అంతేకాదు, ఈ పోరాటానికి తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి..అంటూ కోరారు.

Chiranjeevi: చుట్టమల్లే సాంగ్ ఏఐ డీప్‌ఫేక్స్ పై మెగాస్టార్ ఆగ్రహం..అవును, తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ సుధీర్ఘమైన నోట్ ను రాశారు. అందులో పలు అంశాలను వివరిస్తూ ఏఐ డీప్‌ఫేక్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అంతేకాదు, ఈ పోరాటానికి తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి..అంటూ కోరారు.

దేవర 'చుట్టమల్లే' సాంగ్ కి ఏఐ డీప్‌ఫేక్ సెగ:

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకి ముందు ఈ పాట లిరికల్ వీడియో, ఆ తర్వాత వచ్చిన ఫుల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే, ఇదే క్రేజ్‌ను ఉపయోగించుకుని కొందరు ఏఐ టెక్నాలజీతో డీప్‌ఫేక్ వీడియోలను రూపొందిస్తూ వాటిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారు.

ఒరిజినల్ వీడియోలో లేని విజువల్స్‌ను AI ద్వారా క్రియేట్ చేసి, నటీనటుల ముఖాలను ఉపయోగించడం వల్ల ఇలాంటి కంటెంట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ముఖాలు, రూపాలను ఉపయోగించడంతో సినీ తారలు మనోవేదనకి గురౌవుతున్నారు. ఈ విషయంలో, మెగాస్టార్ చిరంజీవి..తన అనుమతి లేకుండా ఆయన ఫొటోలను గానీ, వీడియోలను గానీ ఉపయోగించకూడదని ప్రకటించారు.

ఇప్పటికే, సమంత..రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, జాన్వీ కపూర్, దీపిక పడుకొనె సహా పలువురు స్టార్ హీరోయిన్ ఈ ఏఐ దెబ్బకి బెంబేలెత్తిపోయారు. ఇటీవలే సుప్రీం కోర్టు సమంతకి సంబందించిన ఎలాంటి వల్గర్ కంటెంట్ ఉన్నా వెంటనే తొలగించాలని ఆదేశాలు జారి చేసింది. ఇంతలోనే చుట్టమల్లే సాంగ్ ఏఐ ఫేక్ వీడియో వచ్చి వైరల్ అయింది. దీంతో, వెంటనే హీరో ఎన్టీఆర్ స్పందించాడు. ఎక్స్ ద్వారా తీవ్ర అసహనాన్ని వ్యక్తపరుస్తూ నోట్ రాశారు. ఇప్పుడు, ఇదే సంఘటనపై మెగాస్టార్ కూడా స్పందించారు. దీనికోసం అందరం కలిసి పోరాడదామని..ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తాను. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలి.

ఇందుకోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి. మన సంఘాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు, అందరం సమష్టిగా కృషి చేయాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను..అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

#Megastar Chiranjeevi#NTR#Devara#Chuttamalle Song#Janhvi Kapoor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి