తెలంగాణ

TG : 22ఏ పరేషాన్.. ఎమ్మెల్యేల మాట వినని కలెక్టర్లు!

రచన: Kumar••5 నిమిషాల పఠనం

తెలంగాణలో 22ఏ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే అధికారులను ఆర్డీవోలకు అప్పగించారు.అయితే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది.

తెలంగాణలో 22ఏ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే అధికారులను ఆర్డీవోలకు అప్పగించారు.అయితే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది. దీంతో ఆర్డీవోలు, కలెక్టర్లు 22ఏ అంశంలో ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.మరోవైపు నిషేధిత జాబితాలో ఉన్న తమ భూముల సమస్యను పరిష్కరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.

మరోవైపు రాష్ట్రంలో 22ఏ సమస్య లేదన్నట్టుగా సీఎంవో, సీసీఎల్ఏ అధికారులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ భూముల డేటాలో ఎలాంటి తప్పులు లేవని, పట్టణ ప్రాంతాల్లో యూఎల్సీ సమస్య మాత్రమే ఉందన్నట్టుగా సీఎం రేవంత్,మంత్రి పొంగులేటికి రిపోర్టులు ఇస్తున్నట్టు తెలిసింది. ఖారీజ్ ఖాతా పేరిట ప్రతి ఊరిలో 50 నుంచి 100 ఖాతాలను 22 ఏ లిస్టులో చేర్చినట్టు సమాచారం. లక్షలాది ఎకరాల పట్టా భూమిపై ఇంకా నిషేధం కొనసాగుతోంది.

భూ భారతి డేటాలో పట్టా, ఐజీఆర్ఎస్‌లోని 22ఏ లిస్టుల్లో ఖారీజ్ ఖాతా, అసైన్డ్, భూ దాన్, వక్ఫ్ అంటూ నమోదు చేసినట్టు సమాచారం.అయితే, ఎక్కడా ఆందోళనలు లేవని, ఏ ఊరిలోనూ తమ పట్టా భూమిని నిషేధిత జాబితాలో పేర్కొన్నారంటూ దరఖాస్తులు రావడం లేదని సీఎంవో, సీసీఎల్ఏ అధికారులు సీఎం, మంత్రికి వివరిస్తున్నట్టు తెలిసింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా మునుగోడు సెగ్మెంటులో ఓ ఊరిలో సగానికి పైగా విస్తీర్ణాన్ని 22ఏ కింద పెట్టగా..అనేక గ్రామాల్లో తమ పట్టా భూములను 22ఏ కింద చేర్చారంటూ బాధిత రైతులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. అందుకు తగిన ఆధారాలన్నీ చూపారు.దీంతో చండూరు ఆర్డీవోకు ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఏ ఆధారాలతో 22ఏ కింద రైతుల భూములు నమోదు చేశారంటూ ప్రశ్నించారు. 50, 60 ఏండ్లుగా పట్టా భూములుగా ఉన్న వాటిని భూదాన్, అసైన్డ్ అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు.

10 రోజుల్లో మొత్తం పట్టా భూములను తొలగించాలని ఆదేశించగా.. తమకేం తెలియదని, అంతా ఉన్నతాధికారులకే తెలుసు అంటూ తప్పించుకుంటున్నట్టు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యే ఇచ్చిన 10 రోజుల గడువు విషయాన్ని కలెక్టర్‌కు చెప్పగా.. ఆయన సైతం ‘మనం ఏం చేస్తాం? అంతా ఉన్నతాధికారులదే బాధ్యత. మార్గదర్శకాలు వస్తే చేద్దాం..రాకపోతే ఏం చేస్తాం’ అని అనట్టుగా తెలిసింది.

ఒక్క మునుగోడులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.దీంతో స్థానిక ఎమ్మెల్యేలపై రైతులు, ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎమ్మెల్యేలు చెప్పినా కలెక్టర్లు, ఆర్డీవోలు పట్టించుకోవడం లేదని సమాచారం.

#22A#prohibited#land issue#telangana#collecters#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి