తెలంగాణ

TG : రేవంత్‌ రెడ్డి వెనుక బినామీ సామ్రాజ్యం

రచన: Kumar••5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక పెద్ద సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.

-'దుంప శిరీష'అనే మహిళను ముసుగుగా పెట్టుకుని వ్యాపారం

-మెడికవర్‌లో రూ.13,300 కోట్ల వాటాల అమ్మకం

-సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689 శాతం మేర ఎలా పెరిగింది?

-బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక పెద్ద సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. మెడికవర్ ఆస్పత్రిలో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్న సదరు మహిళ పేరిట ఉన్న వాటాలను ఏకంగా రూ.13,300 కోట్లకు అమ్మేశారని తెలిపారు. రెండేళ్ల కాలంలో సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689 శాతం మేర ఎలా పెరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

‘మేక్స్ బైన్’ ఫార్మా కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణతో పాటు దుంప శిరీష ప్రధాన డైరెక్టర్లుగా ఉన్నారని క్రిశాంక్ వెల్లడించారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి కుమార్తె అనుముల నైమిషా రెడ్డి కొంపల్లిలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ భాగస్వామ్యంలోనూ దుంప శిరీష, గీతా ఆటోమోటివ్ సంస్థలు డైరెక్టర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి లేదా పాఠశాలను నిర్మించని రేవంత్ రెడ్డి, తన కుమార్తె కోసం కొంపల్లిలో భారీ విస్తీర్ణంలో అంతర్జాతీయ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నారని విమర్శించారు.

గతంలో 2009లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్న ఒక అద్దె భవనంలో నడిచే హోటల్‌ను రేవంత్ రెడ్డి పెద్ద భూతద్దంతో చూపిస్తూ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని క్రిశాంక్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుటుంబంతో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు కలిగి ఉండి, వేల కోట్ల రూపాయల లావాదేవీల్లో భాగస్వామిగా ఉన్న దుంప శిరీష వెనుక ఉన్న అసలు రహస్యాన్ని రేవంత్ రెడ్డి బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి బినామీ సామ్రాజ్యం, ఆయన కుటుంబానికి చెందిన వ్యాపార భాగస్వామ్యాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిధులు, పదవిని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న వ్యాపారాలు, హఠాత్తుగా పెరిగిన ఫార్మా, హాస్పిటాలిటీ, విద్యాసంస్థల ఆదాయ మూలాలను ప్రజల ముందు ఉంచాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.

#Cm revanth reddy#binamies#Anumula family#politics#Manne krishank#BRS#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి