తెలంగాణ

SiyaGoyal: కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. చాట్ జీటీపీలో వింత ప్రశ్నలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రేమించి, నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేతన్ అగర్వాల్ కేసులో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణే సమీపంలోని లోహగడ్ కోట వద్ద జరిగిన ఈ సంచలన మరణంపై పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల సుదీర్ఘ ఛార్జిషీట్ నేరానికి సంబంధించిన పూసగుచ్చిన ప్రణాళికను బయటపెట్టింది.

 ప్రేమించి, నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేతన్ అగర్వాల్ కేసులో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణే సమీపంలోని లోహగడ్ కోట వద్ద జరిగిన ఈ సంచలన మరణంపై పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల సుదీర్ఘ ఛార్జిషీట్ నేరానికి సంబంధించిన పూసగుచ్చిన ప్రణాళికను బయటపెట్టింది. ఈ ఘోర హత్యకు కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్ ప్రధాన సూత్రధారిగా తేలగా, ఆమెతో పాటు స్నేహితులు చేతన్ చౌదరి, రితేష్ హంగేలను పోలీసులు నిందితులుగా పేర్కొంటూ విచారణ వేగవంతం చేశారు.

 ఈ హత్యకు సుమారు నెల రోజుల ముందే పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా వెల్లడైంది. మే 31న కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లిన సియా, అతడిని తోసేయాలనుకున్న చోట వివిధ కోణాల్లో ఫొటోలు తీసి ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత జూన్ 18న ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో కేతన్‌ను మళ్లీ అదే కోటకు రప్పించి, వెనుక నుంచి బలంగా లోయలోకి నెట్టడమే కాకుండా స్నేహితుడితో తన్నించి కిరాతకంగా చంపేశారని ఛార్జిషీట్‌లో వివరించారు.

 టెక్నాలజీ ఆధారంగా నేరం తర్వాత తప్పించుకునేందుకు నిందితురాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ను దారుణంగా దుర్వినియోగం చేసింది. హత్యకు ముందే కేతన్ తల్లికి క్షమాపణ మెసేజ్ రాయడానికి చాట్‌జీపీటీ సాయం తీసుకున్న సియా, హత్య అనంతరం దుఃఖిస్తున్నట్లు ఎలా నటించాలి? పోలీసులు ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పి తప్పించుకోవాలనే విషయాలపై శోధించినట్లు ఆధారాలు లభించాయి. నేరం చేయడానికి వీలుగా క్రైమ్ పాడ్‌కాస్ట్‌లు, థ్రిల్లర్ సినిమాలు చూసి ఈ కుట్రకు రూపుదిద్దినట్లు విచారణాధికారులు గుర్తించారు.

 ప్రారంభంలో ఈ ఘటనను ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసుల లోతైన దర్యాప్తుతో అసలు నిజాలు బయటికొచ్చాయి. టెక్నాలజీని నేరానికి ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టంచేసే ఈ 5,053 పేజీల ఛార్జిషీట్ ఆధారంగా కోర్టులో తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

#KetanAgarwalCase#SiyaGoyal#ChatGPTCrime#LohagadFort#PuneNews#CrimeNews#TechCrime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి