National

రాహుల్ గాంధీ పోటీకి భయపడ్డారు.. ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సమాజ్‌వాది పార్టీ నేత, ప్రతాప్‌గఢ్ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి స్థానం నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారని విమర్శించారు. సమాజ్‌వాది పార్టీతో పొత్తు లేకపోయి ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు.

 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ, 2024లో రాయ్‌బరేలితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంప్రదాయ గడపలాంటి రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడానికి కూడా రాహుల్ మొదట వెనుకడుగు వేశారని శివ్‌పాల్ సింగ్ అన్నారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పూర్తి భరోసా ఇవ్వడంతోనే ఆయన చివరకు అక్కడ బరిలోకి దిగారని వెల్లడించారు.

 యూపీలో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు వేళ ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ కనీసం 150అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా, ఎస్పీ మాత్రం 55సీట్లకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ 50 కంటే ఎక్కువ సీట్లు అడగకూడదని, ఉన్నదానితో సంతృప్తి చెందాలని ఎంపీ హితవు పలికారు.

 కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయినా తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ తేల్చి చెప్పారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 255, సమాజ్ వాది పార్టీకి 101, కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీపై, సీట్ల కేటాయింపుపై శివ్‌పాల్‌సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#RahulGandhi#SamajwadiParty#ShivpalSinghPatel#RaeBareli#UPElections2027#CongressVSsp#IndiaAlliance
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి