International

International : ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం..

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ద్వీపదేశమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ స్థాయిలో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:07 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు భారత భూకంప అధ్యయన కేంద్రం అధికారికంగా వెల్లడించింది.

ద్వీపదేశమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ స్థాయిలో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:07 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు భారత భూకంప అధ్యయన కేంద్రం అధికారికంగా వెల్లడించింది.

రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారు జామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ దేశ వాసులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపైకి చేరుకున్నారు.

అయితే, ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. సునామీ ముప్పు కూడా లేదని విపత్తు నిర్వహణ విభాగం ప్రాథమికంగా పేర్కొంది. భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో సమీప ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం బలంగా ఉందని అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల నిరంతర కదలికల కారణంగా ఇండోనేషియాలో తరచూ తీవ్ర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కాగా, అధికారులు ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 105 మంది మరణించినట్లు ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ధృవీకరించింది. ఈ ఘటనలో 1,678 మందికి పైగా గాయపడగా, దాదాపు 1,80,000 మంది నిరాశ్రయులయ్యారు.ఈ విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే ఇండోనేషియా కోలుకుంటుండగా..మరోసారి భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

#indinesia#earthquake#intenational#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి