సినిమా

Sampat Nandi: నవంబర్ 12న రిలీజ్ 'భోగి' రిలీజ్ ..

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Sampat Nandi: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ఈ సినిమా కోసం ఆయన పూర్తి ఫిట్‌గా, స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. దర్శక-రచయిత, నిర్మాత సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ను జరుపుకుంటోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తయింది.

Sampat Nandi: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ఈ సినిమా కోసం ఆయన పూర్తి ఫిట్‌గా, స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. దర్శక-రచయిత, నిర్మాత సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ను జరుపుకుంటోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తయింది.

మిగిలివున్న కొద్దిపాటి టాకీ పార్ట్ కూడా అతి త్వరలోనే పూర్తి చేయనున్నారు. శర్వానంద్ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా పూర్తి చేయనున్నారు. అయితే, ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీని ప్రకటించలేదు. పైగా, వరుస భారీ చిత్రాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి.

ఇక, ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. అన్నీ పనులు గనక పూర్తైతే ఈ నవంబర్ 13నే థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దర్శకుడు సంపత్ నందికి ఆశించిన భారీ విజయం దక్కలేదు. దాంతో, శర్వాతో చేస్తోన్న ఈ భోగి సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ లో భాగాంగా ఈ మువీ టీజర్ ను రిలీజ్ చేశారు.

​ఇందుకోసం హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఓ ఈవెంట్ కూడా జరిపారు. ఈ ఈవెంట్‌లోనే భోగి సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇచారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా నవంబర్ 13న కాకుండా ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ చిత్రంలో శర్వానంద్ చేసే యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్‌ సినిమాకి మేజర్ ప్లస్ కానున్నాయట. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు. మరో వైపు బిజినెస్ వ్యవహారాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా అటు దర్శకుడికి, ఇటు హీరోహీరోయిన్స్‌కి చాలా కీలకంగా మారింది.

#Sampath Nandi#Sharwanand#Bhogi#Anupama Parameshwaran#Dimple Hayathi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి