Anupama Parameswaran: తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమమ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయళీ ముద్దుగుమ్మ..తెలుగులో అ.ఆ సినిమాతో ల్యాండ్ అయింది. ఆ తర్వాత శతమానం భవతి, హలోగురూ ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది.
అనుపమ తన సహజమైన అందం, నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ..కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. మధ్యలో కొంత గ్యాప్ తర్వాత 18 పేజెస్, కార్తికేయ2, రౌడీ బాయ్స్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. కాస్త అందాల ఆరబోతతోనూ ట్రై చేసింది. కానీ, ఆమెకి కథా బలమున్న సినిమాలే సక్సెస్‌లను ఇస్తాయని గ్రహించి అలాంటి సినిమాలనే ఎంచుకుంటోంది.
ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలంటే బలమైన కథ, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఒప్పుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో, ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల ఎంపికలో కొత్త పంథాను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై, గ్లామర్, స్కిన్ షో కోసం వచ్చే పాత్రలకు దూరంగా ఉండాలని అనుపమ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అనుపమ ఇకపై బోల్డ్ లేదా గ్లామర్ సన్నివేశాలకు పూర్తిగా దూరంగా ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, అసలు విషయం కేవలం స్కిన్ షో చేయడమా లేదా అన్నది కాకుండా.. ఆ సన్నివేశం కథలో ఎంతవరకు అవసరం, పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్న అంశాలపైనే దృష్టి పెట్టి సినిమాల ఎంపిక ఉండబోతుందట.
భోగి సినిమా చాలా ప్రత్యేకం:
తాజాగా, శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమా టీజర్ రిలీజైంది. డీగ్లామర్ పాత్రలో అనుపమ కనిపించింది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను నవంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా అనుపమకి చాలా ప్రత్యేకమని అర్థమవుతోంది. పవర్ ఫుల్ పాత్ర అని కూడా టీజర్‌తో తెలుస్తోంది.
అలాగే, ఈ మలయాళ ముద్దుగుమ్మ నటిస్తున్న క్రేజీ కళ్యాణ్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి తాజాగా అందం మురిస్రే..గంధం కురిసే అంటూ సాగే సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్‌లో అనుపమ చాలా హోంలీగా కనిపించింది. ఈ రెండు సినిమాలను గనక గమనిస్తే ఇకపై, అందాల ఆరబోతకు ససేమిరా అనేలా ఉంది అనుపమ.


