సినిమా

Keerthy Suresh: నవంబర్ 20న "సత్యవాన్ సావిత్రి"..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Keerthy Suresh: "మహానటి" సినిమాతో తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కథానాయికగా మాత్రమే కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి నుంచి మరో విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే ‘సత్యవాన్ సావిత్రి’.

Keerthy Suresh: "మహానటి" సినిమాతో తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కథానాయికగా మాత్రమే కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి నుంచి మరో విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే ‘సత్యవాన్ సావిత్రి’.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, కీర్తి అభిమానుల్లో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. టైటిల్‌ నుంచే సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని కలిగిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’లో కీర్తి లాయర్ పాత్రలో కనిపించబోతోంది.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇక మనం లేదు..సావిత్రి పోరాటమే అని క్యాప్షన్ తో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే, నాని నటించిన ది ప్యారడైజ్ సినిమలఓ ఏష నాగుల అంటూ ఫోక్ సాంగ్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌లో ఉర్రూతలూగించింది. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌లో కీర్తి-రాధిక ఆప్టే నటించిన అక్క సిరీస్ రిలీజ్ కానుంది.

కాగా, ఈ సినిమాకి ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు మిస్కిన్, బాల శరవన్, శిల్ప మంజునాథ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మిస్కిన్, కీర్తి సురేష్‌ల మధ్య కోర్ట్ సీన్స్..లాయర్లుగా వారి వాదనలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇటీవల వచ్చిన కోర్ట్ డ్రామాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. మరి, కీర్తి చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం ఆమెకి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

జనవరి 12 విడుదల హిట్ ఖాయం:

సర్కారు వారి పాట, దసరా సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో కీర్తి నటిస్తున్న సినిమా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న జనవరి 12 విడుదల. 2027, సంక్రాతి బరిలో ఈ సినిమా దిగబోతోంది. వెంకటేష్‌కి జంటగా కీర్తి కనిపించబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టి మరో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో కీరికి గ్యారెంటీగా హిట్ దక్కుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇది, అనిల్ కి 10వ సినిమా. చూడాలి, మరి ఈ హిట్ మెషిన్ ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్స్ ఇద్దరికీ హిట్ ఇచ్చి ఒడ్డున చేర్చుతాడో లేదో.

#Sathyavan Savithri#Keerthy Suresh#OTT#Janavari 12 Vidudhala#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి